district officers
-
కొత్త పంచాయతీలు 226..!
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలో కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేసే గ్రామాల వివరాలు కొలిక్కి వస్తున్నాయి. ఈ నెల 16న సీఎం కేసీఆర్‌తో హైదరాబాద్‌లో కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల సమావేశం అనంతరం ఇదివరకు రూపొందించిన కొత్త జీపీల ప్రతిపాదనల్లో కొంత మార్పులు చేర్పులు చేపట్టిన విషయం తెలిసిందే. ఒకపక్క కొత్త గ్రామపంచాయతీల వివరాలను రూపొందిస్తూనే మరోపక్క ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేసే గ్రామాల విషయంలో గ్రామస్తుల అభిప్రాయ సేకరణ చేపట్టారు. మున్సిపాలిటీలో గ్రామాలు విలీనమైన పక్షంలో స్వల్పంగా మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉంది. జిల్లాలో 243 గ్రామపంచాయతీలు ఉండగా, తాజాగా కొత్త జీపీ(గ్రామ పంచాయతీ)ల ఏర్పాటు విషయంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, పంచాయతీరాజ్ ఏఈలు గత వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు. అవి తుది దశకు వస్తున్నాయి. తాజా మార్పులు చేర్పులకు ముందు జిల్లాలో 225 గ్రామాల కోసం అప్పట్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అందులో 300 జనాభాకు తక్కువ ఉన్న గ్రామాలను కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అర కిలోమీటర్ దూరమున్నవి కూడా పరిగణనలోకి తీసుకున్నారు. తాజాగా జరిగిన మార్పుల్లో 300 జనాభాకు తక్కువ ఉన్న గ్రామాలను, అర కిలోమీటర్ దూరంలో ఉన్న వాటిని దీంట్లో నుంచి తొలగించారు. గ్రామపంచాయతీకి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఎస్సీ, గ్రామాలను స్పెషల్ కేటగిరీలో కొన్నింటిని పరిగణనలోకి తీసుకొని గ్రామపంచాయతీల కోసం కొత్త ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇలా 226 గ్రామపంచాయతీలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. గురువారం వరకు ఉట్నూర్, నార్నూర్ మండలాలు మినహాయించి మిగతా మండలాల వివరాలు వచ్చాయి. దీనిపై శుక్ర, శనివారాల్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 25 వరకే కొత్త ప్రతిపాదనలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దానిని 31 వరకు పొడిగించారు. కలెక్టర్ అభిప్రాయ సేకరణ.. జిల్లాలోని ఏకైక ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేసే గ్రామాల విషయంలో కలెక్టర్ దివ్యదేవరాజన్ గురువారం ఉదయం 11 నుంచి సాయంత్రం 7గంటల వరకు ఆయా గ్రామాలను సందర్శించి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి జితేందర్‌రెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్, ఇతర అధికారులతో కలిసి ఆమె గ్రామాలకు వెళ్లారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మావల, కచ్కంటి, అనుకుంట, బట్టిసావర్గాం, రాంపూర్, బెల్లూరి, నిషాన్ఘాట్ గ్రామాలను విలీనం చేయాలని ఇదివరకు ప్రతిపాదనలు రూపొందించారు. నిషాన్ఘాట్, బెల్లూరి మినహాయించి మిగతా అన్ని గ్రామాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి అభిప్రాయాలను సేకరించారు. ప్రధానంగా మావల, కచ్కంటి, బట్టిసావర్గాం గ్రామాల ప్రజలు మున్సిపాలిటీలో విలీనంపై వ్యతిరేకత చూపారు. ప్రధానంగా మున్సిపాలిటీలో విలీనమైన పక్షంలో ఉపాధిహామీ కింద కూలీ పనులను కోల్పోయే పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేఆర్కే కాలనీ ఆర్ఓఎఫ్ఆర్ కింద రావడంతో దాని విషయంలోనూ ఆలోచన చేస్తున్నారు. సాయంత్రం వరకు అభిప్రాయ సేకరణ అనంతరం కలెక్టర్ రాత్రి అధికారులతో సమావేశమయ్యారు. ఈ విషయంలో చర్చించారు. విలీన గ్రామాల విషయంలో ఇంకా కొలిక్కి రాలేదు. శుక్ర, శనివారాల్లోనే ఇదికూడా తుదిదశకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మావల, బట్టిసావర్గాం గ్రామపంచాయతీల్లోని మిగతా గ్రామాలను మున్సిపాలిటీలో కలిపే అవకాశాలు లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా టీచర్స్ కాలనీ, దస్నాపూర్, కైలాస్‌నగర్, టైలర్స్‌కాలనీ, పిట్టలవాడ, దుర్గానగర్ కాలనీలు ఇప్పటికే పట్టణంలో కలిసిపోయినట్టు ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాలను కలిపి మావల, బట్టిసావర్గాం గ్రామాలను గ్రామపంచాయతీలుగానే ఉంచే అవకాశాలు లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే మేజర్ గ్రామపంచాయతీ అయిన మావల చిన్నపాటి గ్రామపంచాయతీగా మిగిలిపోనుంది. బట్టిసావర్గాంది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా ఈ రెండుమూడు రోజుల్లో గ్రామపంచాయతీల వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. రెండు రోజుల్లో కొలిక్కి.. గ్రామపంచాయతీల ఏర్పాటు కొలిక్కి వస్తోంది. వివిధ అంశాల ఆధారంగా పరిశీలన చేయడం జరిగింది. ఇప్పుడున్న 243 గ్రామపంచాయతీలకు అదనంగా మరో 226 గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందులో 47 గ్రామాలు మాత్రమే 500 జనాభాకు లోబడి ఉన్నాయి. మిగతా 179 గ్రామాలు 500 జనాభాకు పైబడి ఉన్నాయి. – జితేందర్‌రెడ్డి, డీపీఓ, ఆదిలాబాద్ -
సులభంగా ఇసుక రవాణా
నల్లగొండ : ఇసుక పన్ను వ్యవస్థను ప్రతిజిల్లాలో ఏర్పాటు చేయాలని ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. శనివారం అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, జేసీ, మైన్స్ అధికారులతో హైదరాబాద్ నుంచి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. జిల్లాలో ఇసుక పన్ను వ్యవస్థను ఏర్పాటు చేసి అవసరమున్న లబ్ధిదారులకు అందుబాటు ధరలో సరఫరా చేయాలన్నారు. ఫోన్ ద్వారా కాల్ సెంటర్లో రిజిస్టర్ చేసుకున్న వారికి ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దళారి వ్యవస్థ లేకుండా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్, మిషన్ భగీరథ, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లకు ఇసుక సరఫరాలో ఇబ్బందులను అధిగమించాలన్నారు. ఇసుక తరలించే దూరాన్ని బట్టి ధరలో మార్పులుంటాయని తెలిపారు. ప్రజావాణి తరహాలోనే పరిశ్రమల శాఖ ప్రజావాణి ఏర్పాటు చేసి అందులో చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఏర్పడే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఇసుక రవాణాపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. వీడియో కాన్ఫరెన్సులో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, జేసీ నారాయణరెడ్డి, ఏఎస్పీ పద్మనాభరెడ్డి, ఏఓ మోతిలాల్ పాల్గొన్నారు. -
లెక్కలుంటేనే మొక్కలున్నట్లు
పాఠశాలల్లో కూరగాయలను పండించాలి కలెక్టర్ యోగితారాణా డీఈవో లింగయ్యకు ప్రశంస డిచ్పల్లి : తెలంగాణకు హరితహారం కింద నాటిన మొక్కలకు ఉపాధి హామీ కూలీలతో అనుసంధానం చేసి మొక్కల సంరక్షణకు నీరు పోస్తున్నట్లు జాబ్‌కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితేనే మొక్కలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తుందని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా స్పష్టం చేశారు. శుక్రవారం డిచ్పల్లిలోని ట్రైజం ట్రైనింగ్ సెంటర్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో హరితహారం మొక్కల మనుగడకు చేపట్టిన చర్యలను కలెక్టర్ సమీక్షించారు. ఇక నుంచి ప్రతి మొక్కకు వారం, వారం నీరు పోయాలని ఆదేశించారు. నీరు పోసేందుకు ఉపాధిహామీ పథకం కింద జాబ్‌కార్డులను జారీ చేసి ప్రతినెలా చెల్లింపులు జరుపనున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో నాటిన మొక్కలకు విద్యార్థులతో నీరు పోయించరాదని స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో నీరు పోసేందుకు ప్రతి మొక్కకు రోజుకు 45 పైసల చొప్పు నెలకు 26 రోజుల పాటు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి ఉపయోగపడే కూరగాయలను హరితహారంలో భాగంగా పెంచాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మునగ, ఉసిరి మొక్కలను నాటాలన్నారు. చనిపోయిన వాటి స్థానంలో ప్రత్యామ్నాయ మొక్కలను నాటాలని ఆదేశించారు. శాఖల వారీగా ఈనెల 25లోపు మొక్కల మనుగడపై నివేదిక ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చనిపోయిన మొక్కల స్థానంలో 44వేల 585 మొక్కలు నాటించిన జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్యను కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. మొక్కల మనుగడపై క్షేత్రస్థాయి పరిశీలనకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక అధికారుల బృందం రానున్నట్లు తెలిపారు. మొక్కలకు ముళ్లకంప కంచెలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రీ గార్డుల ఏర్పాటుకు బ్యాంకు అధికారులు ఇప్పటి వరకు రూ. 6.30 లక్షలను విరాళంగా ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ మున్సిపాలిటీలో నాటిన మొక్కలకు ట్రీ గార్డుల ఏర్పాటు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ ఇంజినీర్లను ఆదేశించారు. కళాశాలలు, పాఠశాలల ఆవరణలో ఫాం పాండ్స్, కమ్యూనిటీ సోక్పిట్స్ నిర్మించడానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో మోహన్‌లాల్, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, ఆర్డీవోలు యాదిరెడ్డి, నగేశ్, సుధాకర్‌రెడ్డి, yీ ఎఫ్‌వోలు సుజాత, ప్రసాద్, జోజి, హార్టికల్చర్ డీడీ సునంద తదితరులు పాల్గొన్నారు. -
లెక్కలుంటేనే మొక్కలున్నట్లు
పాఠశాలల్లో కూరగాయలను పండించాలి కలెక్టర్ యోగితారాణా డీఈవో లింగయ్యకు ప్రశంస డిచ్పల్లి : తెలంగాణకు హరితహారం కింద నాటిన మొక్కలకు ఉపాధి హామీ కూలీలతో అనుసంధానం చేసి మొక్కల సంరక్షణకు నీరు పోస్తున్నట్లు జాబ్‌కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితేనే మొక్కలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తుందని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా స్పష్టం చేశారు. శుక్రవారం డిచ్పల్లిలోని ట్రైజం ట్రైనింగ్ సెంటర్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో హరితహారం మొక్కల మనుగడకు చేపట్టిన చర్యలను కలెక్టర్ సమీక్షించారు. ఇక నుంచి ప్రతి మొక్కకు వారం, వారం నీరు పోయాలని ఆదేశించారు. నీరు పోసేందుకు ఉపాధిహామీ పథకం కింద జాబ్‌కార్డులను జారీ చేసి ప్రతినెలా చెల్లింపులు జరుపనున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో నాటిన మొక్కలకు విద్యార్థులతో నీరు పోయించరాదని స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో నీరు పోసేందుకు ప్రతి మొక్కకు రోజుకు 45 పైసల చొప్పు నెలకు 26 రోజుల పాటు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి ఉపయోగపడే కూరగాయలను హరితహారంలో భాగంగా పెంచాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మునగ, ఉసిరి మొక్కలను నాటాలన్నారు. చనిపోయిన వాటి స్థానంలో ప్రత్యామ్నాయ మొక్కలను నాటాలని ఆదేశించారు. శాఖల వారీగా ఈనెల 25లోపు మొక్కల మనుగడపై నివేదిక ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చనిపోయిన మొక్కల స్థానంలో 44వేల 585 మొక్కలు నాటించిన జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్యను కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. మొక్కల మనుగడపై క్షేత్రస్థాయి పరిశీలనకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక అధికారుల బృందం రానున్నట్లు తెలిపారు. మొక్కలకు ముళ్లకంప కంచెలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రీ గార్డుల ఏర్పాటుకు బ్యాంకు అధికారులు ఇప్పటి వరకు రూ. 6.30 లక్షలను విరాళంగా ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ మున్సిపాలిటీలో నాటిన మొక్కలకు ట్రీ గార్డుల ఏర్పాటు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ ఇంజినీర్లను ఆదేశించారు. కళాశాలలు, పాఠశాలల ఆవరణలో ఫాం పాండ్స్, కమ్యూనిటీ సోక్పిట్స్ నిర్మించడానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో మోహన్‌లాల్, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, ఆర్డీవోలు యాదిరెడ్డి, నగేశ్, సుధాకర్‌రెడ్డి, yీ ఎఫ్‌వోలు సుజాత, ప్రసాద్, జోజి, హార్టికల్చర్ డీడీ సునంద తదితరులు పాల్గొన్నారు. -
షేమ్...షేమ్!
సాక్షి ప్రతినిధి, కడప: అధికారం ముందు హోదాలు బలాదూర్ అవుతున్నాయి. వేదిక ఏదైనా తెలుగుతమ్ముళ్లు ఆశీనులవుతున్నారు. ప్రభుత్వ భాగస్వామ్యులైన ప్రజాప్రతినిధులను, అధికారులను విస్మరిస్తున్నారు. ప్రోటోకాల్ విస్మరిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం కలెక్టర్ సాక్షిగా ఉన్నతాధికారులు ఘోర పరాభవం చవిచూశారు. టీడీపీ నేతల ముందు కమిషనర్, డీఈఓ చేతులు కట్టుకొని నిల్చోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఏకంగా ఇన్చార్జి మంత్రి సమక్షంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయస్థాయి పోటీపరీక్షలకు సన్నద్ధం చేసేందుకు 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం మున్సిపల్ హైస్కూల్స్‌లో ఐఐటీ, నీట్ కెరీర్ ఫౌండేషన్ కోర్సు ప్రవేశపెట్టారు. శుక్రవారం కడపలోని మున్సిపల్ హైస్కూల్ (మెయిన్)లో ఈ కార్యక్రమాన్ని మంత్రి గంటాశ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వ ఉద్దేశాన్ని మంత్రి వివరించారు. కాగా అధికారిక కార్యక్రమంలో అధికారులకు చోటు దక్కకపోగా టీడీపీ నేతలు మూకుమ్మడిగా తిష్టవేశారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, సురేష్‌నాయుడు, హరిప్రసాద్, దుర్గాప్రసాద్‌లు వేదికపై ఆశీనులయ్యారు. వీరంతా కలెక్టర్ కేవీ సత్యనారాయణ, మంత్రి గంటా చెంతన కూర్చొని ఉండగా కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, డీఈఓ ప్రతాపరెడ్డి, హెచ్ఎం సుబ్బారెడ్డిలు నిల్చోవాల్సి వచ్చింది. సాక్షాత్తు మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో సైతం కలెక్టర్ సాక్షిగా ప్రోటోకాల్‌కు తిలోదాకాలిచ్చారు. కార్యక్రమం ముగిసేంత వరకూ ఉన్నతాధికారులు ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోవాల్సిన వచ్చింది. తలాడించాల్సిన దుస్థితి టీడీపీ నేతలు ఎవరు స్పందించినా గంగిరెద్దులా తలాండించాల్సిన దుస్థితి జిల్లాలో నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాకేంద్రంలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ప్రోటోకాల్ ఉల్లంఘనను కలెక్టర్ నియంత్రించాల్సి ఉంది. కాగా ఇదేవిషయమై ఓ ఉన్నతాధికారి సాక్షితో మాట్లాడుతూ అవన్నీ పట్టించుకుంటే ఇక్కడ ఉద్యోగం ఉండదని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు చెప్పినట్లే ఏకపక్షంగా విధులు నిర్వర్తిస్తున్నా అనేక సమస్యలు చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారకార్యక్రమంలో సీటు దక్కకపోయినా బాధలేదు, దూషణలు లేకపోతే చాలంటూ పేర్కొనడం విశేషం. దీనిని బట్టి అధికారుల మానసిక పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
చంద్రశేఖరా.. గొంతెండుతోంది
మీరు చెప్పినా.. నీరివ్వలె! గజ్వేల్ నియోజకవర్గంలో మంచినీటి కటకట సీఎం ఆదేశించినా పట్టని అధికారులు నిధుల విడుదలలో జాప్యమే కారణం? సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గమైన గజ్వేల్‌లోనే మంచినీటికి జనం కటకటలాడుతున్నారు. 20 రోజులుగా నీటి సరఫరా లేదు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎట్టిపరిస్థితుల్లో నీటి కష్టాలు రానివ్వొద్దని కేసీఆర్ స్వయంగా ఆదేశించినా అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. మరోవైపు బోరుబావుల్లో భూగర్భ జలమట్టం వడివడిగా పడిపోతోంది. గజ్వేల్ : గజ్వేల్ నగర పంచాయతీ ప్రజానీకాన్ని కొన్ని రోజులుగా నీటి సమస్య కటకటలాడిస్తోంది. ఫలితంగా ఈనెల 5న ప్రజ్ఞాపూర్ ఏడో వార్డులో దాహర్తి తీర్చాలంటూ మహిళలు రోడ్డెక్కాల్సి వచ్చింది. సమస్యకు అధికారుల నిర్లక్ష్యమే కారణంగా ఉంది. తాజాగా శుక్రవారం జరిగిన నగర పంచాయతీ పాలకవర్గ సమావేశంలో మంచినీటి సమస్యపై ఇద్దరు మిహ ళా కౌన్సిలర్లు ధర్నా చేయడం సమస్య తీవ్రతను చాటుతోంది. నగర పంచాయతీలో ఈ వేసవిలో మంచినీటి సమస్యను అధిగమించేందుకు గడిచిన ఫిబ్రవరిలోనే అధికారులు రూ.61 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. నిజానికి ఈ నిధులు వేసవి ఆరంభంలో అంటే మార్చిలోనే విడుదల కావాలి. కానీ అధికారులు ఆలస్యంగా ప్రతిపాదనలు పంపడంతో ఏప్రిల్ 27న రూ.30 లక్షలను మాత్రమే మంజూరుచేస్తూ జిల్లా అధికారులు ఆదేశాలిచ్చారు. నిధులు సకాలంలో విడుదలై ఉంటే నగర పంచాయతీ పరిధిలో ట్యాంకర్లను పెంచే వారమని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆరు ట్యాంకర్లు నడుపుతున్నారు. మరో అయిదు వరకు ట్యాంకర్లు తక్షణమే నడపాల్సి ఉంది. నిజానికి ఈ నెల 5న ఏడో వార్డులో జరిగిన ధర్నాకు ట్యాంకర్ల పెంచకపోవడమే కారణం. తాజాగా విడుదలైన నిధులతో ట్యాంకర్ల సంఖ్య మరో రెండుకు పెంచుతామని కమిషనర్ శంకర్ చెబుతున్నారు. ఈ ట్యాంకర్లు మరో రెండు నెలలపాటు నిరంతరంగా నడిసేన్తే ఈ సీజన్ గట్టెక్కుతుంది. నియోజకవర్గంలో మంచినీటి సమస్య రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. కానీ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించడంపై నిరసన వ్యక్తమవుతోంది. మరో విషయమేమిటంటే 0.7ఎంఎల్డీ (7 లక్షల లీటర్లు) మంజీర మంచినీటి పథకం ద్వారా సరఫరా కావాల్సి ఉండగా 20 రోజులుగా ఈ నీటి సరఫరా నిలిచిపోయింది. నర్సాపూర్ సమీపంలోని బోర్పట్ల సంప్ వద్ద ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో ఈ సమస్య తలెత్తింది. పట్టణంలోని ఓవర్‌హెడ్ ట్యాంకుల నుంచి రోజువారీ సరఫరా అవుతున్న నీటికి తోడుగా మంజీర నీరందితే కొంత ఉపశమనం కలిగేది. పరిస్థితి భిన్నంగా మారటంతో నగర పంచాయతీ ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. శుక్రవారం నీటి సరఫరాను పునరుద్ధరించడం కాసింత ఉపశమనం కలిగించింది. నీళ్లకు మస్తు తిప్పలైతుంది... మంచినీటికి మస్తు తిప్పలైతుంది. సరిపోయేటన్ని ట్యాంకర్లు వస్తలేవ్వు. నీళ్లు దొరకక కష్టాలు పడుతున్నం. ఇప్పటికైనా మా కష్టాలు తీర్చాలె. - మడిపడిగ గాలయ్య (భారత్ నగర్) -
నవ్విపోదురు గాక...
‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉంది కొందరు అవినీతి అధికారుల తీరు. లాభాపేక్ష లేకుండా, నిష్పక్షపాతంగా పనిచేద్దామని, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలుంటాయని ఉన్నతాధికారులు ప్రతీన బూనిన కొన్ని గంటల్లోనే ఓ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అవినీతి వ్యతిరేక వారోత్సవాలు ప్రారంభించిన రోజే, సాక్షాత్తూ జిల్లా అధికారులు ప్రతిజ్ఞ చేసిన జిల్లా సచివాలయంలోనే ఈ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. కరీంనగర్ క్రైం : బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన న్యాలం శ్రీనివాస్ మరో 24 మందితో కలిసి గీత పారిశ్రామిక సహకార సంఘం అనుమతి కోసం ఎక్సైజ్ సహకార సంఘాల ఇన్స్పెక్టర్ పానకల్ సురేందర్‌రెడ్డిని సంప్రదించారు. అన్నిరకాల పత్రాలు, సంఘం తీర్మానం కాపీని జతచేశారు. పత్రాలు పరిశీలించిన ఆయన గత నెల 19న అనుమతి మంజూరు చేశారు. సంఘంలో సభ్యత్వ అర్హత, గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ఒక్కో సభ్యుడు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని, మొత్తం రూ.25 వేలు ఇస్తేనే మిగతా అనుమతులు ఇస్తానని సదరు ఇన్స్పెక్టర్ తెగేసి చెప్పాడు. అంత ఇచ్చుకోలేమని చెప్పినా వినకుండా రూ.15 వేలు ఇవ్వాలని పట్టుబట్టాడు. తామందరం కూలీ చేసుకుని బతుకుతామని, చెట్లు కూడా లేవని తక్కువగా ఉన్నాయని చెప్పినా అధికారి వినిపించుకోలేదు. దీంతో శ్రీనివాస్ రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారమే స్కెచ్ సురేందర్‌రెడ్డిని పట్టుకునేందుకు మంగళవారమే ఏసీబీ అధికారులు స్కెచ్ వేశారు. వారి సూచన మేరకు శ్రీనివాస్ డబ్బులు తీసుకుని రాగా, సురేందర్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో తప్పించుకున్నాడు. బుధవారం సదరు అధికారి శ్రీనివాస్‌కు ఫోన్‌చేసి రమ్మనడంతో సాయంత్రం 6 గంటల సమయంలో కలెక్టరేట్లోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయానికివచ్చాడు. అక్కడ శ్రీనివాస్ నుంచి రూ.15 వేలు తీసుకుంటుండగా సురేందర్‌రెడ్డిని ఏసీ బీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా రు. నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బుధవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. ప్రమాణం చేసిన కొద్ది గంటల్లోనే... బుధవారం నుంచి ఈ నెల 9 వరకూ ఏసీబీ అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అవినీతిని నిర్మూలిస్తామని బుధవారం ఉదయం కలెక్టరేట్లోని గాంధీ విగ్రహం వద్ద కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రమాణం చేశారు. ఎక్కడైతే ప్రమాణం చేశారో అదే కాంప్లెక్స్‌లో ఓ అవినీతి అధికారి కొద్ది గంటల్లోనే పట్టుబడడం ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఎంతలా పాతుకుపోయిందో చెబుతోంది. ఏ జోన్లో లేనంతగా మన జోన్లోనే ఈ ఏడాదిలో ఇప్పటివరకు 40 మంది అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఎక్సైజ్‌పై ఫిర్యాదులు కొంతకాలంగా ఎక్సైజ్ అధికారులపై అనేక ఫిర్యాదు వస్తున్నాయి. వాటిని సమీక్షించి దాడులు చేస్తున్నాం. ఎక్కడ ప్రభుత్వ అధికారులు లంచం అడిగినా వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించండి. ఏసీబీ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాలు ప్రారంభమైన రోజునే... లంచం తీసుకోబోమని ప్రతిజ్ఞ చేసిన కొద్ది గంటల్లోనే ఓ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. - సుదర్శన్‌గౌడ్, ఏసీబీ డీఎస్పీ బతిమిలాడినా వినలేదు సహకార సంఘాల ఇన్స్పెక్టర్ రూ.25 వేలు లంచం అడిగిండు. ఎంత బతిమిలాడినా వినలేదు. రెండుమూడు సార్లు కలిసి మా బాధ వివరించినం. చివరకు రూ.15 వేలు ఇస్తేనే సభ్యత్వ అనుమతి, గుర్తింపు కార్డులు ఇస్తానని చెప్పాడు. పేదోళ్లమని చెప్పినా పట్టించుకోలేదు. అందుకే లంచం అడుగుతున్నాడని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన. - శ్రీనివాస్, బాధితుడు -
జిల్లా అధికారులతో రాజీవ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్ : తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ సోమవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదాయ పరిమితి పెంచుతూ మార్గదర్శకాల నేపథ్యంలో రేషన్ కార్డులు, పెన్షన్ల దరఖాస్తుల పున పరిశీలపై ఆయన అధికారులతో సమీక్షించారు. సమీక్ష సమావేశానికి గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సెర్ప్ సీఈవో మురళీ తదితరులు హాజరయ్యారు. మరోవైపు 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల నిధుల వివాదంపై కూడా రాజీవ్ శర్మ సమీక్షించారు. ఆరోగ్యశ్రీ సీఈవో ధనుంజయ్ రెడ్డి, వివిధ శాఖల పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
భాస్కర్ వచ్చాకే ఫైళ్లు కదులుతున్నాయట
సాక్షి, ఏలూరు : జిల్లా కలెక్టర్‌గా ఎవరున్నా ఆయన వ్యవహార శైలి, పనితీరుకు అనుకూలంగా అధికారులు మసలు కోవడం సహజమే. కానీ.. ప్రస్తుత కలెక్టర్ కె.భాస్కర్‌ను జిల్లా అధికారులు ఆయన పనితీరును బహిరంగంగా ప్రశంసించడం విశేషం. తాజాగా కలెక్టర్ పనితీరును పొగుడుతూ పౌర సంబంధాల అధికారి ద్వారా శుక్రవారం ప్రకటన విడుదల చేయడం మరీ విశేషం. జిల్లా పంచాయతీ అధికారి ఎ.నాగరాజువర్మ, డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బి.రమణ, వయోజన విద్యాశాఖ డెప్యూటీ డెరైక్టర్ దుర్గాభవాని, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ కేఈ సాధన శుక్రవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్ భాస్కర్ మెరుపువేగంతో ఫైళ్లను క్లియర్ చేస్తున్నారని, గురుపూజోత్సవానికి వచ్చినప్పుడు కూడా ఫైళ్లు పరిష్కరించారని కొనియాడారు. జూలై 12న బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ అధికారుల పనితీరును స్వయంగా బేరీజు వేసుకునే స్థాయికి చేరారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ బంగ్లాలోకి అధికారులెవరూ రానవసరం లేదని, ఫైల్ పంపిస్తే వెంటనే పరిష్కరిస్తానని కలెక్టర్ చెబుతున్నారని తెలిపారు. తప్పు మీద తప్పులు చేసే అధికారులకు నోటీసులు ఇస్తూ, అధికారులకు హితబోధలు చేస్తున్నారన్నారు. గతంలో రెండు నెలలు పట్టేది గతంలో కలెక్టర్ నుంచి ఫైల్ రావడానికి నెలల తరబడి ఎదురుచూసేవాళ్లమని, భాస్కర్ వచ్చినప్పటి నుంచి 2 లేదా 5 నిమిషాల్లో ఫైల్‌పై చర్చించి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో కలెక్టర్ బంగ్లాలో సమర్పించిన ఫైల్స్‌ను కలెక్టర్ ఎప్పటికి చూస్తారో, అవి ఎప్పటికి కార్యాలయాలకు తిరిగి వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని కొందరు అధికారులు అంటున్నారని తెలిపారు. ప్రస్తుత కలెక్టర్‌పై తమ ‘భక్తి’ని చాటుకోవడానికి గత కలెక్టర్లు పనిచేయలేదని స్వయంగా అధికారులు బహిరంగంగా ప్రకటించడం, పత్రికా ప్రకటనలు చేయడం విమర్శలకు తావిస్తోంది. -
ఇందిరమ్మ ఇళ్లపై నిఘా
సాక్షి, అనంతపురం : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతిని వెలికి తీసి.. అర్హులకే బిల్లులు మంజూరు చేసే విధంగా జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా జియో ట్యాగింగ్ అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. 2005-06 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు.. అంటే గడిచిన పదేళ్లలో ఇందిరమ్మ పథకంతో పాటు ‘రచ్చబండ’లో జిల్లాకు 4,07,779 ఇళ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణాల్లో చాలా వరకు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం లోటు బడ్జెట్‌తో పుట్టెడు కష్టాల్లో ఉన్న టీడీపీ ప్రభుత్వం.. వాటి నుంచి గట్టెక్కేందుకు సంక్షేమ పథకాల్లో లొసుగులను వెతికి పట్టుకుంటూ నిబంధనలు కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ పథకాల్లోనూ అక్రమాల వెలికితీతకు సిద్ధమవుతోంది. జూలై 31న హైదరాబాద్‌లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రితో పాటు ఆ శాఖ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన హౌసింగ్ పీడీల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ‘జియో ట్యాగింగ్’ అనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా నిజమైన లబ్ధిదారులకే బిల్లులు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి ఈ విధానాన్ని అమలులోకి తేవడానికి చర్యలు ప్రారంభించారు. ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్లలో పూర్తయినట్లు చెబుతున్న 1,90,510 ఇళ్లలో చాలా వరకు దొంగ బిల్లులు చేసినట్లు విమర్శలున్నాయి. కొన్ని చోట్ల హౌసింగ్ అధికారులే నిధుల్ని కాజేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇంతకు ముందున్న ఇళ్లను చూపి బిల్లులు పొందడం, ఇంటి పేరుతో ప్రహరీలు, పశువుల శాలలు, అతిథి గృహాలు, అంతస్తులు నిర్మించుకోవడం, పాత ఇంటికి మరమ్మతులు చేయించుకోవడం వంటి అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం ఆధారాలను కూడా సేకరించింది. బోగస్ రేషన్ కార్డులతో కూడా అక్రమాలకు పాల్పడినట్లు తేల్చింది. జిల్లాలో దాదాపు ఐదు వేల ఇళ్లు బోగస్‌గా గుర్తించింది. ఇకపై ఇలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాలని హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం ‘జియో ట్యాగింగ్’ విధానం ద్వారా గృహ నిర్మాణాలను పర్యవేక్షించనున్నారు. జియో ట్యాగింగ్ అంటే... భూమిపై నిర్ధిష్టంగా ఒక ప్రాంతాన్ని గుర్తించటాన్ని ‘జియో ట్యాగింగ్’ అంటారు. ప్రతి ప్రదేశానికి నిర్ధిష్టమైన అక్షాంశం, రేఖాంశం ఉంటాయి. గృహ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయగానే వాటి అక్షాంశం, రేఖాంశం నమోదయ్యేలా ఫొటోలు తీస్తారు. వీటికి, దశల వారీగా పూర్తి చేసిన నిర్మాణాలకు అక్షాంశాలు, రేఖాంశాలు సరిపోలితేనే బిల్లులు మంజూరు చేస్తారు. లేదంటే బోగస్‌గా నిర్ధారిస్తారు. హౌసింగ్, రెవెన్యూ సిబ్బంది ప్రతి రోజూ క్షేత్ర స్థాయిలో పర్యటించి ఫొటోలు తీసి సర్వర్‌కు అప్లోడ్ చేస్తారు. అలాగే వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను ఆర్డీఓ, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేకాధికారి, ఈఈల ఆధ్వర్యంలో తనిఖీ చేస్తారు. ఎంతమంది అర్హులుగా ఉన్నారు..ఎంత మంది లేరన్న వివరాలను సేకరించి సర్వర్‌కు అప్లోడ్ చేస్తారు. ఇంతకు ముందు లబ్ధిదారులు గృహ నిర్మాణాల వద్ద వివిధ దశలకు సంబంధించి ఫొటోలు దిగి బిల్లులు పొందేవారు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. జియో ట్యాగింగ్ విధానంలో భాగంగా ఇంటి నిర్మాణంలో ప్రతి దశను ఫొటోలు తీసి సెంట్రల్ సర్వర్‌కు పంపుతారు. ఆ ఫొటోలు అవే ఇంటివని తేలాక బిల్లులు చెల్లిస్తారు. అక్రమాలు నిగ్గు తేల్చేందుకే... ఇందిరమ్మ పథకంలో దాదాపు ఐదు వేల ఇళ్లను నకిలీ రేషన్‌కార్డులతో కాజేసినట్లు ఆరోపణలున్నాయి. దాదాపు రూ.30 కోట్ల అవినీతి జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ అక్రమాలను నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జియో ట్యాగింగ్ విధానం ద్వారా అక్రమాలు వెలికితీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. కొద్దిరోజుల్లోనే విచారణ ప్రారంభం కానుంది. విచారణకు సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. -
అమ్మా బెలైల్లినాదో..
మహబూబ్‌నగర్ కల్చరల్ : పాలమూరు భక్తిపారవ ష్యంతో పొంగిపోయిం ది.. గల్లీలన్నీ పోచమ్మ అమ్మవారి నామస్మరణంతో మార్మోగాయి.. మహిళలు బోనం ఎత్తి భారీ ఊరేగింపుతో వచ్చి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించారు. ప్రభుత్వం బోనాల పండుగను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించడంతో పాలమూరులో జిల్లా అధికారులు మంగళవారం అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక రవీంద్రనగర్‌లోని శీతలాదేవి పోచమ్మ వారి దేవాలయాన్ని రంగుల విద్యుత్‌దీపాలు, తోరణాలతో అలంకరించారు. ఉదయం నుంచి జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి ఉపముఖ్యమంత్రి రాజయ్య రాష్ట్ర ప్రభుత్వం తరపున రానున్నారని తెలియడంతో ప్రజలు అధిక సంఖ్యలో బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించి జిల్లాతోపాటు రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని శీతలాదేవి అమ్మవారికి డిప్యుటీ సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు మేళతాళాలతో స్వాగతం పలికారు. అలాగే జిల్లాలోని ఆయా గ్రామాల్లోనూ బోనాల వేడుకలు జరిగాయి. -
బెంబేలెత్తించిన మంత్రి అచ్చెన్న
శ్రీకాకుళం కలెక్టరేట్: రాష్ట్ర కార్మిక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ ల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం వివిధ శాఖల అధికారులను బెంబేలెత్తించారు. జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తన ప్రతాపం చూపించారు. రాష్ట్రమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయన నిర్వహించిన సమీక్ష సాదాసీదాగా సాగుతుందని అధికారులు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. వ్యవసాయ శాఖపై సమీక్షతో సమావేశాన్ని ప్రారంభించిన మంత్రి, ఎరువులు సక్రమంగా అందజేయాలని అధికారులకు గట్టిగా చెప్పారు. నీటి పారుదల, వంశధార ప్రాజెక్టులపై సమీక్ష జరిగినపుడు మంత్రి తీరు పూర్తిగా మారింది. నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల పరిధిలోని అంశాలను ప్రధానంగా తీసుకుని ఇంజినీర్లపై ఆయన మండిపడ్డారు. నరసన్నపేటలోని బీసీ సంక్షేమ వసతిగృహాన్ని ఎత్తివేసే అధికారం ఎవరిచ్చారని సంబంధిత ఈఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని గమనించిన కలెక్టర్ సౌరభ్‌గౌర్ కల్పించుకుంటూ తదుపరి సమావేశంలో అన్ని అంశాలను కూలంకుషంగా చర్చిద్దామని, ఈ సమావేశాన్ని పరిచయాలకు పరిమితం చేయాలని మంత్రిని కోరారు. అనంతరం రిమ్స్, వైద్యఆరోగ్య శాఖలపై సమీక్షలు లోతుగా జరగకుండా కలెక్టర్ జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులపై పట్టు సాధించేందుకే మంత్రి ఇలా వ్యవహరించారని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. -
తుది దశకు ఏర్పాట్లు
మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. ఈ ఉత్సవానికి వేదికగా ఎంపిక చేసిన ఏఎన్‌యూ ఎదురుగానున్న స్థలంలో పనులు గడచిన వారం రోజులుగా సాగుతున్న విషయం తెలిసిందే. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో భారీ ఎత్తున పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. జిల్లా అధికారులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తుంటే.. నాయకులు దీనిని ఆర్భాటంగా చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రాంగణంలో బారికేడ్ల నిర్మాణం పూర్తికాగా తాత్కాలిక రోడ్లు ఏర్పాటు చేశారు. అలాగే సభ రాత్రి వేళ కావడంతో ప్రతి రెండు వందల అడుగుల దూరంలో ఒక్కోటి వంతున దాదాపు రెండువేల హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రానికి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆదేశాలు అందడంతో ఆ మేరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా వేదిక నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ప్రధాన వేదికను 480 అడుగులతో ఏర్పాటు చేస్తున్నారు. ఐరన్ బారికేడ్లతో వేదికను నిర్మించి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రెయిన్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. 600 మంది మీడియా ప్రతినిధులకు, 5వేల మంది వీఐపీలకు పాస్‌లు కేటాయించాలని నిర్ణయించారు. గురువారం ఉదయం వేదిక వెనుక భాగంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ట్రయిల్ రన్ నిర్వహించిన అధికారులు ... ఏర్పాట్లలో భాగంగా గురువారం పోలీస్ ఉన్నతాధికారులు మైదానంలో కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించారు. టోల్గేట్ సమీపంలోని రహదారి వద్ద నుంచి సభా ప్రాంగణం వెనుక రహదారి గుండా 20 పోలీస్ వాహనాలతో ట్రయిల్ రన్ నిర్వహించారు. గుంటూరు రేంజ్ ఐజీ సునీల్‌కుమార్, గుంటూరు రూరల్, అర్భన్ ఎస్పీలు జె.సత్యనారాయణ, గోపీనాథ్ జెట్టిలు దీనిని పర్యవేక్షించారు. అధికారులు, నేతల పరిశీలన ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను ఐఏఎస్ అధికారులు శ్యామ్‌బాబు, ఎం దానం కిశోర్‌బాబు, జిల్లా కలెక్టర్ ఎస్.సురేష్‌కుమార్, కడప జిల్లా కలెక్టర్ కోన శశిధర్, జేసీ వివేక్ యాదవ్, గుంటూరు రేంజ్ ఐజీ సునీల్‌కుమార్, అర్భన్, రూరల్ ఎస్పీలు గోపినాథ్ జెట్టి, జె సత్యనారాయణ, డీఐజీ రామకృష్ణ, ఆర్డీవో రామ్మూర్తి పరిశీలించారు. వేదిక నిర్మాణ పనులను మరింత వేగంగా చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్, పార్టీ నేతలు మన్నవ సుబ్బారావు, మద్దాలి గిరిధర్, జియావుద్దీన్, అబ్దుల్ అఖీమ్, గంజి చిరంజీవి, పోతినేని శ్రీనివాసరావు తదితరులు పరిశీలించిన వారిలో ఉన్నారు. -
నిరాశే!
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: జిల్లాకు కొత్త కలెక్టర్ వచ్చినప్పుడల్లా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని ప్రజలు ఎదురుచూడడం అలవాటై పోయింది. కానీ ప్రతిసారీ వారికి నిరాశే మిగులుతోంది. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా వినతులు మాత్రం పేరుకుపోతున్నాయి. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కలెక్టర్ నూతన విధానాన్ని ప్రారంభించినా.. దాని వల్ల అశించిన ఫలితాలు రావడం లేదు. రోజు రోజుకూ వినతులు పెరుగుతున్నాయే కాని తగ్గడం లేదు. గతంలో గ్రీవెన్స్‌డేకు ఆయా శాఖలకు సంబంధించిన కిందిస్థాయి అధికారులు హాజరయ్యేవారు. కలెక్టర్ శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులందరూ తప్పకుండా గ్రీవెన్స్‌డేకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం జిల్లా అధికారులందరూ గ్రీవెన్స్ డేకు హాజరవుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారు. ఆర్డీఓ కార్యాలయంలోను గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారు. గ్రీవెన్స్ డేలో ప్రజలు సమర్పించిన అర్జీలు వేల సంఖ్యలో పరిష్కారానికి నోచుకోకుండా అలాగే ఉన్నాయి. సుమారు 7 వేలకు పైగా అర్జీలు పరిష్కారానికి నోచుకోలేదు. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఆర్డీఓ, తహశీల్దారు కార్యాలయాల్లో ప్రజలు 5,071 వినతి పత్రాలు సమర్పించారు. వాటిలో 1,948 అర్జీలు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. 3,123 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. నెల్లూరు తహశీల్దార్ కార్యాలయంలో అత్యధికంగా 2,094 వినతి పత్రాలు ప్రజలు సమర్పించారు. వాటిలో కేవలం 4 వినతులను మాత్రమే అధికారులు పరిష్కరించారు. దొరవారిసత్రం మండలంలో అతి తక్కువగా 17 వినతి పత్రాలు సమర్పించారు. వాటిలో 15 సమస్యలను పరిష్కరించారు. రెండు సమస్యలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. నెల్లూరు డివిజన్ పరిధిలో 2,951 అర్జీల్లో 423 పరిష్కరించారు. 2,528 పెండింగ్‌లో ఉన్నాయి. నాయుడుపేట డివిజన్ పరిధిలో 487కు 446 పరిష్కరించారు. కావలి డివిజన్లో 522కు 369 పరిష్కరించారు. గూడూరు డివిజన్లో 626కు 349 పరిష్కరించారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలో 485కు 361 సమస్యలను పరిష్కరించారు. వివిధ శాఖల జిల్లా అధికారుల వద్ద 4 వేలకు పైగా అర్జీలు పరిష్కారానికి నోచుకోలేదు. సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ కార్పొరేషన్, డీఆర్డీఏ, హౌసింగ్ తదితర శాఖల వద్ద అధిక సంఖ్యలో అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. రెండు నెలల నుంచి ఎన్నికల హడావుడి, కోడ్ ఉండడంతో అర్జీల వైపు అధికారులు దృష్టిసారించలేదు. మండల స్థాయిలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నా ప్రజలు మాత్రం కలెక్టరేట్లో బారులుతీరుతున్నారు. కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పిస్తే త్వరగా సమస్య పరిష్కారానికి నోచుకుంటుందని ప్రజల నమ్మకం. దీంతో గ్రీవెన్స్ డేకు గ్రామీణప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో హాజరవుతుంటారు. జిల్లా యంత్రాంగం స్పందించి తమ సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం: కలెక్టర్ గ్రీవెన్స్డేపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. నూతన విధానాలను ప్రారంభించారు.గ్రీవెన్స్ డేలో ప్రజలు సమర్పిస్తున్న అర్జీలను త్వరగా పరి ష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ఎన్నికల వల్ల సమస్యలు అధికంగా ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. - నాగేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి -
కొత్త ప్రభుత్వంలోనే బదిలీలు
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఇతర జిల్లాల అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా చేదువార్త వారి చెవిన పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు జిల్లాను వీడే అవకాశం లేదని తెలిసి నిట్టూరుస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలు పూర్తయ్యాక.. బదిలీల ప్రక్రియను ఈనెల 24 లోపు పూర్తి చేయాల్సి ఉంది. అయితే కొత్త ప్రభుత్వ ఏర్పాటు మెలికతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఎంపీడీఓలు, తహశీల్దార్లు, పోలీసు అధికారులకు మరో 15 రోజుల పాటు పడిగాపులు తప్పదని తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా జిల్లాలో మూడు సంవత్సరాలకు పైబడి పని చేస్తున్న అధికారులను ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఇతర జిల్లాలకు బదిలీ చేయడం తెలిసిందే. అందులో భాగంగానే గత ఫిబ్రవరిలో జిల్లాకు అనంతపురం, కడప, చిత్తూరు నుంచి 48 మంది తహశీల్దారు, 37 మంది ఎంపీడీఓలు.. కొందరు పోలీసు అధికారులు బదిలీపై వచ్చారు. ఎన్నికల తంతు పూర్తి కావడంతో వారంతా తిరిగి ఆయా జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 24వ తేదీతో తాము వెళ్లిపోవచ్చని భావించగా.. రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నందున ఆ ప్రక్రియ విధివిధానాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే నివేదికపై దేశ ప్రధాని ఆమోదం తెలపాల్సి ఉందని తెలిసి నిరాశకు లోనవుతున్నారు. యూపీఏ ప్రభుత్వం ఘోర పరాజయం పాలవడం.. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో ఉద్యోగుల బదిలీలకు సాంకేతిక కారణాలు అడ్డొస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి పదవీ విరమణ చేయడం.. కొత్త సీఎస్‌ను నియమించకపోవడం.. రాష్ట్ర విభజన ప్రక్రియకు సమయం దగ్గర పడటం కూడా బదిలీల బ్రేక్‌కు కారణమైనట్లు సమాచారం. ఏదేమైనా జూన్ 2వ తేదీ తర్వాత కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యే వరకు బదిలీలపై ఉద్యోగులు ఆశలు వదులుకోవాల్సిందే. -
తవ్వేస్తున్నారు
వాకాడు, న్యూస్‌లైన్: కంచే చేను మేస్తోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందంలోని కొందరు సభ్యులే అక్రమ రవాణాకు అండగా నిలుస్తున్నారు. అధికారుల్లోనే కొందరు అండగా నిలవడంతో ఇసుక వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. రేయింబవళ్లు తేడా లేకుండా స్వర్ణముఖి నదిలోని ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. జిల్లాలోని ఇసుక రీచ్‌ల్లో మైనింగ్‌కు గతంలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల గడువు ఇటీవల పూర్తయింది. ఈ క్రమంలో ఇసుకకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. లంచాలకు అలవా టు పడ్డ కొందరు అధికారులను లోబరచుకుని వాకాడు, కోట, చిట్టమూరు మండలాల పరిధిలోని స్వర్ణముఖి నదిలో పలుచోట్ల ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రేయింబవళ్లు ట్రాక్టర్లలో ఇ సుక తరలించేస్తున్నారు. సందట్లో సడేమియా : ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆయా పంచాయతీ కార్యదర్శుల నుంచి కూపన్లు పొంది ఇసుక తో లుకోవచ్చు. ఇతరులు అయితే నిర్ణీత మొత్తం చలానా కట్టి పర్మిట్లు పొందాలి. ఈ అనుమతుల మంజూరు విషయంలో కొన్ని పంచాయతీల కార్యదర్శులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ అ క్రమ రవాణాను అడ్డుకోవాల్సిన టాస్క్‌ఫోర్స్ బృందంలోని కొందరు స భ్యులు మరింత ప్రోత్సహిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున తీసుకుని ట్రాక్టర్లకు రైట్..రైట్ చెబుతున్నారని ఇసుక లోడింగ్‌కు వెళ్లే కూలీలే చెబుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలకు వాహనాలు కూడా కేటాయించారు. అయితే ఈ బృందాల్లోని కొందరు ఇసుక రేవుల్లోనే మకాం వేసి డబ్బులు దం డుకోవడం చూసిన వారు విస్తుపోతున్నారు. ప్రధానంగా వాకాడు, బాలిరెడ్డిపాళెం, కాశీపురం ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కాశీపురంలో అయితే స్థానిక సర్పంచ్ రసీదులు ముద్రించి ట్రాక్టర్‌కు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. అక్రమ రవాణా విషయాన్ని తహశీల్దార్ కల్యాణ్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా కఠినచర్యలు చేపడతానని తెలిపారు. పర్మిట్ల కంటే అదనంగా ఇసుక తోలితే ఆ వాహనాలు సీజ్ చేస్తామని చెప్పారు. -
లేనట్లే
జమ్మలమడుగు,న్యూస్‌లైన్: గండికోట ఉత్సవాలపై పర్యాటక ప్రేమికులు ఆశలు వదులుకుంటున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలో మూడురోజుల పాటు గండికోట ఉత్సవాలను నిర్వహించాలని జిల్లా అధికారులు సంకల్పించారు. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ. 30 లక్షల నిధులను కూడా మంజూరు చేసింది. గండికోటతో పాటు రాజంపేటలోని అన్నమయ్య విగ్రహం వద్ద, కడపలోని శిల్పారామంలో ఉత్సవాలను ఘనంగా జరిపించాలని నిర్ణయించారు. కరవు పరిస్థితులు నెలకొన్న సమయంలో ఉత్సవాలు నిర్వహించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం కావడంతో వాయిదా వేశారు. 2013 చివరలో ఉత్సవాలను నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అప్పుడు కూడా వాయిదా పడ్డాయి. 2014 ఫిబ్రవరి 8,9తేదిల్లో గండికోట ఉత్సవాలను రెండు రోజుల పాటు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ప్రకటించారు. అందరికీ అనుకూలమైన శని, ఆదివారాలలో ఉత్సవాలు నిర్వహించాలనుకోవడంతో ప్రజలు, విద్యార్థులు తిలకిస్తారని పర్యాటక ప్రేమికులు భావించారు. ప్రస్తుతం ఆ తేదీలు కూడా వెళ్లిపోయాయి. ఉత్సవాల నిర్వహణ అనుమానమేనని పలువురు భావిస్తున్నారు. -
ఉత్తమ ఉద్యోగి ఎవరో..!
స్వాతంత్య్ర... గణతంత్ర దినోత్సవాల రోజున ఉత్తమ అధికారిగా పురస్కారం అందుకోవడం గతంలో ఓ పెద్దగౌరవం. పక్కాగా ఉత్తముల ఎంపిక జరిగేది. రాను రాను...‘ఉత్తముల జాబితా’పై ఆసక్తి తగ్గింది. సింహభాగం శాఖాధికారులకు అనుకూలంగా ఉండేవారికే స్థానం దక్కుతోందని, నిజమైన ఉత్తములకు గౌరవం దక్కడం లేదని కొంతమంది ఉత్తమ సేవలు అందించినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది వీటికి చెక్‌పెట్టేందుకు కలెక్టర్ కోనశశిధర్ ఉపక్రమించారు. సాక్షి, కడప: జనవరి 26 గణతంత్ర వేడుకలకు అయిదు రోజుల వ్యవధి ఉంది. జిల్లాలో ఉత్తమ ఉద్యోగులకు పురస్కారాలపై మళ్లీ ఉత్కంఠ మొదలైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా 18వతేదీ లోగా ఉత్తమ ఉద్యోగుల జాబితా అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడం, చాలామంది అధికారులు 25వ తేదీ కూడా జాబితా ఇవ్వడం జరుగుతోంది. ఈక్రమంలో ఈ ఏడాది ఉత్తమ అధికారుల ఎంపికను పక్కాగా సిద్ధం చేసేందుకు జిల్లా అధికారులు కుస్తీలు పడుతున్నారు. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగుల జాబితా ఇవ్వాలని కలెక్టరు కోరినప్పుడు కూడా ఇదే సందిగ్ధం నెలకొంది. నిబంధనలను నిక్కచ్చిగా చూస్తారనే భయంతో ముందురోజు రాత్రి వరకూ కూడా కొన్ని ప్రభుత్వశాఖల అధికారులు జాబితాలు అందజేయలేదు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఏటా 450 నుంచి 500 మంది వరకూ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు ఇస్తున్నారు. అందులో ఎందరు ఉత్తములనే ది గుర్తించడం కష్టంగా మారింది. దీంతో కలెక్టర్ శశిధర్ ఈ పురస్కారాల వ్యవహారాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరూ బాగా పనిచేస్తున్నారని భావిస్తే, ఉత్తముల్లో ఉత్తములను గుర్తించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఎంపిక జాబితాలో ఆరోపణలున్నవారు ఉంటే ఎలా?అని పలు శాఖల అధికారులు జంకుతున్నారు. ఈ నెల 18లోపే జాబితాను సమర్పించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. జిల్లాలో 104 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. వీరిలో కొంతమంది మాత్రమే జాబితాను పంపారు. ముహూర్తం ముంచుకొచ్చాక ఆగమేఘాల మీద తయారుచేసే జాబితాల్లో తప్పులుదొర్లి అర్హులకు ఏటా అన్యాయమే జరుగుతోందని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రేకుల షెడ్డులో కేంద్రీయం
పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా కేంద్రీయ విద్యాలయ పరిస్థితి ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయం రేకులషెడ్డులో నడుస్తోంది. రాష్ట్రప్రభుత్వం 9 ఎకరాల స్థలం, కేంద్రం రూ.10.86 కోట్ల నిధులు విడుదల చేసినా సొంత భవనాలకు నోచుకోలేదు. ఈ దుస్థితి నెల్లూరు నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో నెలకొంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే కేంద్రీయ విద్యాలయానికి సొంత భవనాలు ఒనగూరడం పెద్ద సమస్య కాదు. నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయ ప్రస్తుతం రేకుల షెడ్డులో నడుస్తోంది. కేంద్రీయ విద్యాలయకు జిల్లా అధికారులు 9 ఎకరాల స్థలం కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం రూ.10.86 కోట్లు నిధులు భవ నిర్మాణాల కోసం విడుదల చేసింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే చందంగా ప్రస్తుతం కేం ద్రీయ విద్యాలయ విద్యార్థులు, ఉపాధ్యాయు లు ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హైస్కూలు ప్రాంగణంలో అరువుకు తీసుకున్న రేకుల షెడ్డులో కాలం వెళ్లదీస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాన్ని జిల్లా కేంద్రమైన నెల్లూరులో 2010, సెప్టెంబర్‌లో నెలకొల్పారు. వెంకటగిరిలో ఒక కేంద్రీయ విద్యాలయం ఉన్నప్పటికీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నిరంతర కృషితో నెల్లూరుకు మరో కేంద్రాన్ని తీసుకురాగలిగారు. ఈ కేంద్రాన్ని ఆయన స్వయంగా ప్రారంభించారు. ఆ విద్యాలయం రేకుల షెడ్డులో నడుస్తుండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎంపీ రాజమోహన్‌రెడ్డి నాటి కలెక్టర్ రాంగోపాల్‌తో మాట్లాడి స్థల సేకరణకు అవసరమైన సహాయ సహకారాలు అందించారు. అలాగే రూ.10.86 కోట్ల నిధులు భవన నిర్మాణానికి సాధించారు. మూడేళ్లు అవుతున్నా అధికారుల అలసత్వం వల్ల కేంద్రీయ విద్యాలయానికి సొంత భవనాలు సమకూరలేదు. కేంద్రీయ విద్యాలయ విద్యా విధానానికి అనుగుణంగా విశాలమైన ప్రాంగణంలో, సువిశాలమైన, పటిష్టమైన అన్ని హంగులు కలిగిన భవనం ఉండాలనే ఉద్దేశంతో సుమారు రూ.11 కోట్లు వ్యయంతో నిర్మించేందుకు అనుకూలమైన స్థలాన్ని జిల్లా యంత్రాంగం కేటాయించింది. కొత్తూరు పంచాయతీ బిట్-1 పరిధిలోని సర్వే నం.2103లో 9 ఎకరాల స్థలాన్ని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించారు. ఈ స్థలానికి ఒక వైపు హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉండటంతో సమస్య తలెత్తింది. ఈ వైర్ల వల్ల ప్రమాదమే కాకుండా వాటి నుంచి వెలువడే శక్తి తరంగాలు విద్యార్థుల మెదడుపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు హెచ్చరించారు. దీంతో మరో ప్రాంతంలో భూమి కేటాయించాలని అధికారులు భావించారు. అయితే నగరానికి సమీపంలో ఒకే ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఎక్కువగా లేకపోవడంతో ముందు కేటాయించిన స్థలంలోనే విద్యుత్ తీగలు ఉండే ప్రాంతాన్ని మినహాయించి 7.35 ఎకరాలను కేటాయించారు. ఈ స్థలంలో ప్రస్తుతం ప్రహరీ నిర్మాణం జరుగుతోంది. విజయవాడకు చెందిన అభి కనస్ట్రక్షన్స్ వారు ప్రస్తుతానికి ప్రహరీ వరకే నిర్మించి మలివిడతలో భవన నిర్మాణాలు చేపడతారని తెలిసింది. ఈ భవన నిర్మాణాలు ప్రారంభించేదెప్పుడు, పూర్తియి అక్కడ తరగతులు నిర్వహించేదెప్పుడని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రీయ విద్యా విధానమే వేరు కేంద్రీయ విద్యాలయ విద్యా విధానం ప్రత్యేకంగా ఉంటుంది. బోధన ప్రణాళిక, పాఠశాల సమయం, ప్రార్థన విధానం , వేసవి సెలవు సమయం..ఇలా అన్నీ సాధారణ పాఠశాలకు భిన్నంగా ఉంటాయి. 2010లో నెల్లూరులో విద్యాలయ ప్రారంభించినప్పుడు కేవలం 1 నుంచి 5 తరగతుల వరకు నిర్వహించేవారు. ప్రస్తుతం 8వ తరగతి వరకు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల క్రితం 5వ తరగతి ఉన్న విద్యార్థి తర్వాత ఏడాది 6, ఆ తర్వాత 7, ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నారు. ప్రతి ఏడాది ఒక తరగతిలో కేవలం 40 మందికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. బదిలీపై వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా రక్షణ రంగానికి చెందిన వారి పిల్లలు, ఇతర కేంద్రీయ విద్యాలయాల నుంచి పిల్లలకు కచ్చితంగా ప్రవేశం కల్పించాల్సి ఉంటుంది. సాధారణ ప్రవేశాల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5శాతం, ఎంపీ కోటా కింద 6 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. 200 మంది విద్యార్థులలో ప్రారంభమైన విద్యాలయంలో ప్రస్తుతం 356 మంది ఉన్నారు. ఫీజు వసూళ్లలో త్రైమాసిక విధానం ఇక్కడ మూడు నెలలకొకసారి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 1,2 తరగతులకు మూడు నెలలకు రూ.1500 చెల్లించాలి. 3 నుంచి 8వ తరగతి వరకు మూడు నెలలకు రూ.1800 వసూలు చేస్తారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి భోజనం రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. కాని కంప్యూటర్ ఫీజు మాత్రం మూడు నెలలకు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రీయ విద్యాలయంలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31వరకు విద్యా సంవత్సరంగా పరిగణిస్తారు. మే, జూన్ మాసాల్లో 50 రోజుల పాటు వేసవి సెలువులు ప్రకటిస్తారు. సాధారణ దినాల్లో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.40 గంటల వరకు పాఠశాల నిర్వహిస్తారు. కేంద్రీయ విద్యాలయకు ప్రత్యేక ప్రార్థనా గీతం ఉంటుంది. ఉదయం పాఠశాల ప్రారంభమైనప్పుడు, తిరిగి ఇంటికి వెళ్లేప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద పెద్ద వాయిద్యాలతో మైకుల ద్వారా ప్రార్థనా గీతాన్ని ఆలపించడం విశేషం. -
వారి దారి...ఆధారే!
సాక్షి, అనంతపురం : సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను సైతం జిల్లా అధికారులు పెడచెవిన పెడుతున్నారు. ‘ఆధార్’ లేదన్న సాకుతో ప్రజలకు వంటగ్యాస్ సబ్సిడీని నిరాకరించరాదని కోర్టు ఇచ్చిన తీర్పు జిల్లాలో అమలు కావడం లేదు. ఇప్పటికీ అధికారులు వంట గ్యాస్ సబ్సిడీకి, ఆధార్ సీడింగ్‌కు ముడిపెడుతూనే ఉన్నారు. సీడింగ్ (ఆధార్ సంఖ్యను గ్యాస్, బ్యాంకు ఖాతా వివరాలతో అనుసంధానించడం) చేయించుకుంటేనే సబ్సిడీ వస్తుందని తేల్చి చెబుతున్నారు. సీడింగ్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి అనంతపురం హౌసింగ్ బోర్డులో కంప్లయింట్ సెల్ కూడా ఏర్పాటు చేశారు. అధికారుల తీరు వల్ల ఆధార్‌లేని, సీడింగ్ కాని 1,21,142 మంది వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. వీరు ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే పూర్తి మొత్తం (రూ.1110) చెల్లించాల్సి వస్తోంది. వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమలుకు సంబంధించి మొదటి విడతలోనే అనంతపురం జిల్లాను ఎంపిక చేశారు. ఇది ఒక రకంగా వినియోగదారులకు శాపంగా మారింది. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో నగదు బదిలీ అమలు చేస్తున్నా... పారదర్శకత మాత్రం లోపించింది. పొరుగునే ఉన్న వైఎస్సార్ జిల్లాలో నగదు బదిలీ అమలు ఇంకో రకంగా ఉంది. అక్కడ ఆధార్ అందజేసిన వారికంటే ఇవ్వని వారే సంతోషంగా ఉన్నారు. ఆధార్ సమర్పించని వినియోగదారులకు పాత పద్ధతిలో రూ.473లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. సీడింగ్ పూర్తయిన వారి నుంచి మాత్రం రూ.1,110 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. రాయితీ కోసం వారు ఎదురు చూడాల్సి వస్తోంది. అనంతపురం జిల్లాలో ఆధార్ అందజేసిన, అందజేయని వారి పరిస్థితి ఒకే రకంగా ఉంటోంది. ఇక్కడ నగదు బదిలీని ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి వర్తింపజేస్తున్నారు. ఇప్పటికీ సీడింగ్ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. జిల్లాలో 5,78,470 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 5,10,916 కనెక్షన్లకు సంబంధించి వినియోగదారులు ఆధార్ వివరాలను గ్యాస్ డీలర్లకు అందజేశారు. ఈ నెల ఒకటి నాటికి 4,57,528 కనెక్షన్లకు సీడింగ్ పూర్తయింది. వీరికి కూడా రాయితీ మొత్తం సక్రమంగా జమ కావడం లేదు. ఈ సమస్యపై రోజూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1110 ఉంది. సీడింగ్ సక్రమంగా జరిగి ఉంటే అలాంటి వారికి రూ.638.77 రాయితీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. లేకుంటే పూర్తి మొత్తం చెల్లించాల్సి వస్తోంది. జిల్లాలో ఇంకా దాదాపు 67 వేల మందికి ఆధార్ లే దు. మరో 53,388 మందికి ఉన్నా సీడింగ్ పూర్తి కాలేదు. దీనివల్ల వారు రాయితీకి దూరమవుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు అమలైతే వీరందరికీ న్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్ఓ) శాంతకుమారి దృష్టికి తీసుకెళ్లగా... సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి తమకు పై నుంచి ఎటువంటి ఉత్తర్వులూ అందలేదని చెప్పారు. -
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి భోజనం
సోమశిల, న్యూస్‌లైన్ : అనంతసాగరం పీహెచ్సీ నిర్వహణపై ఇటీవల కాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని ఇక్కడి వైద్యాధికారులు, సిబ్బంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీ టన్నింటిపై విచారణకు డీఎంహెచ్ఓ వస్తున్నారంటే పరిస్థితి చక్కబడుతుందని స్థానికులు భావించారు. అయితే వచ్చిన అధికారులు ఆ రోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి విం దు చేసుకోవడంతో అందరూ అవాక్కయ్యా రు. ఇటీవల ఓ గర్భిణిని 108 వాహనంలో రా త్రి వేళలో ఈ పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఆ స మయంలో సిబ్బంది లేకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. గతంలోనూ ఈ పీహెచ్సీ నిర్వహణపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్, జిల్లా పారా మెడికల్ అధికారి డాక్టర్ పెంచలయ్య ఆకస్మిక తనిఖీ పేరుతో అనంతసాగరం పీహెచ్‌సీకి వచ్చారు. వైద్యాధికారి డా క్టర్ ప్రవీణ్, డ్రాయింగ్ అధికారి డాక్టర్ శ్రీధర్, నర్సులు కుమారి, పద్మను విచారించారు. అనంతరం వైద్యాధికారులతో కలిసి ఉన్నతాధికారులు విందు భోజనం చే స్తుండగా, నర్సులు వడ్డించారు. ఈ భోజనాల ఏర్పాటు ఖర్చంతా పీహెచ్సీ సిబ్బందే భరించడం గమనార్హం. విచారణకు వచ్చిన జిల్లా అధికారులు ఏదో ఇ రగదీస్తారనుకుంటే వారితో కలిసి భోజనాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షుగర్ వ్యాధితో బాధపడుతున్నందునే భోజ నాలు చేశామని అధికారులు చెప్పుకొచ్చారు. చర్యలు తీసుకుంటే పీహెచ్‌సీలు ఖాళీ అధికారులు, సిబ్బంది విధినిర్వహణపై డీఎంహెచ్ఓ మొదట విచారణ నిర్వహిం చారు. ఎటువంటి సమాచారం లేకుండా పద్మ విధులకు గైర్హాజరైనట్లు విచారణలో వెల్లడైంది. దీనిపై కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామని డీఎంహెచ్ఓ చెప్పారు. సిబ్బందిపై చర్యలు తీసుకుంటే పీహెచ్‌సీలే ఖాళీలు అవుతున్నాయని, మళ్లీ వారే కరువయ్యారని ఉన్న వారితోనే సర్దుకుపోవాల్సి వస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. నిధుల గోల్‌మాల్‌పై త్వరలో విచారణ అనంతసాగరం పీహెచ్సీలో అభివృద్ధి నిధుల గోల్‌మాల్‌పై త్వరలో విచారణ చేపడతామని డీఎంహెచ్ సుధాకర్ చెప్పారు. అన్‌టైడ్, శాని టేషన్ నిధుల వినియోగంపైనా విచారణ చేపట్టనున్నామన్నారు. జనని సురక్షయోజన, జన ని శిశు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధిం చిన నిధులు కూడా లబ్ధిదారులకు సక్రమంగా అందడంలేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. -
అధికారులకు బదిలీ బెంగ !
పాలమూరు, న్యూస్‌లైన్: ఉన్నతాధికారులు, తహశీల్దార్లకు సార్వత్రిక ఎన్నికల బదిలీ బెంగ పట్టుకుంటుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే గెజిటెడ్ అధికారులను సొంతజిల్లాల నుంచి ఆర్నెళ్ల ముందునుంచే ఇతర జిల్లాల కు పంపించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయం అమలులో ఉంది. ఈ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే పలువురు ఉన్నతాధికారు లు, తహశీల్దార్లను జిల్లా నుంచి బదిలీచేసే అవకాశం ఉంది. 2009 ఎన్నికల సమయంలో కేవలం 15రోజుల ముందు సొంత జిల్లాకు చెందినవారు, మూడేళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న తహశీల్దార్లకు మరో చోటకు పంపి అక్కడి వారిని మన జిల్లాలో నియమించారు. ఎన్నికల విధులు ముగియగానే ఎక్కడివారిని అక్కడికి మార్చారు. అయితే ఈసారి ఆరునెలల ముందే పంపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించడంతో సాధారణ పరిపాలనశాఖ తగిన కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ విధానం కొనసాగితే ఎన్నికల ప్రక్రియకు ఆరునెలల ముందుగానే జిల్లాలోని పలువురు అధికారులు, తహశీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ తప్పదని తెలుస్తోంది. 36 మండలాల్లో స్థానికులు జిల్లాలో 64 మండలాలకు 28 మండలాల్లో నల్గొండ జిల్లాకు చెందినవారు తహశీల్దార్లుగా పనిచేస్తున్నారు. మిగిలిన 36 మండలాల్లో స్థానికులే కొనసాగుతున్నారు. వీరందరికీ స్థానచలనం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. జిల్లాలో పనిచేస్తున్న అదే జిల్లా అధికారులు, మూడేళ్లుగా పనిచేస్తున్న వారి వివరాలను పంపించాలని ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం వివరాలను సేకరించనుంది. 2009 ఎన్నికల సమయంలో పదవీ విరమణ చేసే వారికి మినహాయింపు ఇచ్చిన ఎన్నికల సంఘం ఈసారి దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో 2014 ఏప్రిల్‌కు అటు ఇటూ పదవీ విరమణ చేసేవారిలో సందిగ్ధం నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో ఎలాగూ బదిలీతప్పదని భావించిన సొంతజిల్లా అధికారులు ఇప్పటినుంచే ఇతర జిల్లాలకు బదిలీ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి కొందరు తహ శీల్దార్లు ఎన్నికల విధులతో సంబంధం లేని విభాగాలకు వెళ్లేందుకు ముందస్తుగానే సిద్ధపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది నిర్ణయించనప్పటికీ.. 2014 ఏప్రిల్‌ను దృష్టిలో ఉంచుకుని ఆరునెలలు ముందుగానే బదిలీ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని, అలాగైతే నవంబర్, డిసెంబర్ నెలల్లో సొంత జిల్లాలోని అధికారులు బదిలీలు చేపట్టనున్నారు. 36 మండలాలకు చెందిన తహశీల్దార్లు మనజిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం వీరిని ఇతర చోట్లకు బదిలీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. కాగా దీన్ని ఇప్పటికిప్పుడు అమలుచేయాలని తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని డిఆర్వో రాంకిషన్ పేర్కొన్నారు. -
ఇసుక పోటు
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఏఈ కార్యాలయాలకు ఇసుకదెబ్బ తగిలింది. ఇసుక కొరత కారణంగా జిల్లాలో ఏఈ కార్యాలయాల నిర్మాణ పనులు ముందుకుసాగడం లేదు. జులై నాటికి నిర్మాణాలు పూర్తిచేయాలని భావించినా ఇసుక దొరక్కపోవడంతో పనుల్లో జాప్యం నెలకొంది. దీనికితోడు సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు ఈ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాసోత్సవాలు కూడా పనులకు అడ్డంకిగా మారాయి. దీంతో ఆ నెలరోజుల పాటు నిర్మాణపనులు నిలిచి పోయినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా కొన్ని మండలాల్లో కార్యాలయాల నిర్మాణానికి స్థలభావం కూడా ఓ సమస్యగా మారింది. జిల్లాలో ప్రతి మండలానికి ఒక ఏఈ కార్యాలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. జిల్లాలో 64 మండలాలకు ఒక్కో ఏఈ కార్యాలయ నిర్మాణం చేపట్టింది. ముందుగా 55 మండలాల్లో ఈ కార్యాలయాలను నిర్మిం చేందుకు జిల్లా అధికారులు పనులు చేపట్టి..ఇప్పటివరకు 36 కార్యాలయాల నిర్మాణపనులు పూర్తిచేశారు. ఇంకా 19 కార్యాలయ భవనాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా కొన్ని స్థలాలు లేక నిర్మాణ పనులు ప్రారంభంకాలేదు. హన్వాడ మండలంలో స్థలం లేక నిర్మాణం చేపట్టలేదని తెలుస్తోంది. చాలాచోట్ల బేస్ లెవల్, లెంటల్ లెవెల్ వరకు వచ్చి ఇసుక కొరతతో మధ్యలోనే ఆగిపోయాయి. ప్రజలకు మరింత చేరువలో.. సేవలు ప్రజలకు మరింత చేరువచేసేందుకు ప్రతి మండలానికి ఒక ఏఈ కార్యాలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా మండలాల్లో ప్రత్యేకించి ఈ శాఖకు కార్యాలయం లేకపోవడంతో గ్రామీణప్రాంత లబ్ధిదారులు ఇబ్బందులు పడేశారు. బిల్లుల కోసం ఎక్కడికి వెళ్లాలో తెలిసేదికాదు. వారి ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి మండలంలో ఏఈ కార్యాల యాన్ని నిర్మించతలపెట్టారు. ఇందుకో సం జిల్లాకు రూ.1.30కోట్లు మంజూరయ్యాయి. ఇందిరా ఆవాస్ పథకం ద్వారా వీటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. 70 గజాలు, 20/20 వ్యాసార్థం గల స్థలంలో రెండు రూమ్‌లతో కూ డిన కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎలా ఉండాలో ప్రజల కు తెలియజెప్పేందుకు మాడల్ ఈ కార్యాలయాలకు శ్రీకారం చుట్టారు. ఒక్కో కార్యాలయాన్ని రూ.2.20 లక్షలతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిం చారు. దీంతో పాటు ఫర్నీచర్ ఏర్పాటుకోసం రూ.20 లక్షలు మంజురు చేయనున్నారు. ప్రతి కార్యాలయానికి రూ.30వేల చొప్పన కేటాయించనున్నారు. గృహ నిర్మాణశాఖ ద్వారా లబ్ధిదారులు ఇళ్లను ఎలా నిర్మించుకోవాలో తెలియజేసేం దుకు ఈ ఇళ్లకు మాడల్‌గా నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. 70 గజాల స్థలంలో ఎలా నిర్మించుకోవాలో ప్రజల కు తెలియజేస్తున్నారు. -
ప్రజలకు ప్రముఖుల దసరా శుభాకాంక్షలు
సాక్షి, నల్లగొండ: ప్రజలు ఆనందోత్సాహాలతో దసరా పండగ సంబురాలు జరుపుకోవాలని జిల్లా అధికారులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కోరారు. ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. అంతా సుఖసంతోషాలతో గడపాలని ప్రార్థించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు సుఖేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కలెక్టర్ చిరంజీవులు, జేసీ హరిజవహర్‌లాల్ ఉన్నారు. -
పురోగతి సాధించాలి
పాలమూరు, న్యూస్‌లైన్: పాలమూరు జిల్లా ప్రతి రంగంలో పురోగతి సాధించాలని.. అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరవుతున్నప్పటికీ కాగితాలకే పరిమితం కావడం సరికాదని జిల్లా ప్రత్యేకాధికారి పి.ఉషారాణి ఆక్షేపించారు. ప్రభుత్వ పథకాలను పేదలకు అందించడంలో జిల్లా అధికారులు చిత్తశుద్ధితో కృషిచేయాలని కోరారు. అలాగే జిల్లాలో పెండింగ్ ఉన్న తాగునీటి పథకాలను నెలరోజుల్లో పూర్తిచేయాలని, ఈ ఏడాది నిర్ధేశించిన ఆయకట్టుకు సాగునీరు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలుతీరుపై మొదటిసారిగా ఆమె ఆయాశాఖల అధికారులతో బుధవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో సమీక్షించారు.. పెండింగ్ పథకాలను పూర్తిచేయాలి జిల్లా పెండింగ్‌లో ఉన్న తాగునీటి పథకాలను నెలరోజుల్లో పూర్తిచేయాలని జిల్లా ప్రత్యేకాధికారి ఉషారాణి అధికారులను ఆదేశించారు. రామన్‌పాడు తాగునీటి పథకానికి నేరుగా విద్యుత్ సరఫరా చేసే ప్రత్యేకలైన్కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న చేతిపంపులకు శాశ్వత రీచార్జి అయ్యే మార్గాన్ని చూడాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కృపాకర్‌రెడ్డిని ఆదేశించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద ఈ ఏడాది నిర్ధేశించిన 44వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే కార్యక్రమాన్ని అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని కోరారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద రెండో పంపును ఏర్పాటుచేసి, పాత ఆయకట్టుతో పాటు నిర్ధేశించిన 7500 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నారు. పొలంబడి, వ్యవసాయ యాంత్రీకరణ తదితర పథకాల కింద నిర్ధేశించిన యూనిట్లను మరో నెలరోజుల్లో పూర్తిచేయాలన్నారు. జిల్లాలో పాలశీతలీకరణ కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చొరవచూపాలని కోరారు. విద్యాశాఖ అధికారుల తనిఖీ పెరగాలి జిల్లాలో 2881 వంటగదుల నిర్మాణానికి అనుమతించగా.. కేవలం 434 మాత్రమే పూర్తయ్యాయని, అలాగే 1200 అదనపు తరగతి గదుల నిర్మాణానికి 400 మాత్రమే పూర్తి చేయడం చూస్తే ఎంత వెనకబడి ఉన్నారో అర్థమవుతుందన్నారు. ప్రత్యేకడ్రైవ్ చేపట్టి నెలలోపు వీటిని పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అక్షరాస్యత తక్కువగా ఉన్న 16 మండలాల్లో మండలస్థాయి సమావేశాలు నిర్వహించి అక్షరాస్యతను పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా శాఖలకు విడుదలవుతున్న నిధులు సకాలంలో సద్వినియోగమయ్యేలా చూడాలని ఆమె సూచించారు. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేసేలా విద్యాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోని వైద్యులు గ్రామీణ పేదలకు పూర్తిస్థాయిలో సేవలందించేలా వైద్యశాఖ జిల్లా అధికారులు దృష్టిసారించాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు సక్రమంగా పనిచేసే విధంగా అధికారులు తనిఖీలు నిర్వహించాలని కోరారు. మాతా, శిశు మరణాలు తగ్గించాలి గ్రామీణస్థాయిలో ప్రభుత్వ, సంక్షేమపథకాలు పూర్తిస్థాయిలో అమలు తీరుపై గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇకనుంచి ప్రతివారం ప్రజావాణి నిర్వహించాలని అధికారులను కోరారు. గ్రామస్థాయిలో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తే జిల్లా, రాష్ట్రస్థాయికి వచ్చే ఫిర్యాదుల సంఖ్య తగ్గుతుందన్నారు. జిల్లాలో మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు ప్రత్యేకచర్యలు తీసుకోవాలని, అక్షరాస్యత పెంపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్వాడీ, ఏఎన్ఎం, డాక్టర్లు శక్తివంచన లేకుండా పనిచేయాలని ఆదేశించారు. స్త్రీ,పురుష నిష్పత్తిలో కూడా జిల్లాలో అంతరం ఎక్కువగా ఉందని, ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆరోగ్య విషయాలపై ప్రతి మూడు నెలలకోసారి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. ప్రభుత్వపథకాల అమలును వేగవంతం చేసేందుకు జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కలెక్టర్ ఎం. గిరిజాశంకర్ వివిధ పథకాల ప్రగతి, ఇతర వివరాలను ప్రత్యేకాధికారికి వివరించారు. సమావేశంలో జేసీ ఎల్.శర్మణ్, ఏజేసీ డాక్టర్ రాజారామ్, జెడ్పీ సీఈఓ రవీందర్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ వెంకట రమణారెడ్డి, సీపీఓ రమణమూర్తి, ఆయా ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.