సోమశిల, న్యూస్‌లైన్ : అనంతసాగరం పీహెచ్‌సీ నిర్వహణపై ఇటీవల కాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని ఇక్కడి వైద్యాధికారులు, సిబ్బంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీ టన్నింటిపై విచారణకు డీఎంహెచ్‌ఓ వస్తున్నారంటే పరిస్థితి చక్కబడుతుందని స్థానికులు భావించారు. అయితే వచ్చిన అధికారులు ఆ రోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి విం దు చేసుకోవడంతో అందరూ అవాక్కయ్యా రు. ఇటీవల ఓ గర్భిణిని 108 వాహనంలో రా త్రి వేళలో ఈ పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఆ స మయంలో సిబ్బంది లేకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. గతంలోనూ ఈ పీహెచ్‌సీ నిర్వహణపై పలు ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్, జిల్లా పారా మెడికల్ అధికారి డాక్టర్ పెంచలయ్య ఆకస్మిక తనిఖీ పేరుతో అనంతసాగరం పీహెచ్‌సీకి వచ్చారు. వైద్యాధికారి డా క్టర్ ప్రవీణ్, డ్రాయింగ్ అధికారి డాక్టర్ శ్రీధర్, నర్సులు కుమారి, పద్మను విచారించారు. అనంతరం వైద్యాధికారులతో కలిసి ఉన్నతాధికారులు విందు భోజనం చే స్తుండగా, నర్సులు వడ్డించారు. ఈ భోజనాల ఏర్పాటు ఖర్చంతా పీహెచ్‌సీ సిబ్బందే భరించడం గమనార్హం. విచారణకు వచ్చిన జిల్లా అధికారులు ఏదో ఇ రగదీస్తారనుకుంటే వారితో కలిసి భోజనాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షుగర్ వ్యాధితో బాధపడుతున్నందునే భోజ నాలు చేశామని అధికారులు చెప్పుకొచ్చారు.
చర్యలు తీసుకుంటే పీహెచ్‌సీలు ఖాళీ
అధికారులు, సిబ్బంది విధినిర్వహణపై డీఎంహెచ్‌ఓ మొదట విచారణ నిర్వహిం చారు. ఎటువంటి సమాచారం లేకుండా పద్మ విధులకు గైర్హాజరైనట్లు విచారణలో వెల్లడైంది. దీనిపై కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామని డీఎంహెచ్‌ఓ చెప్పారు. సిబ్బందిపై చర్యలు తీసుకుంటే పీహెచ్‌సీలే ఖాళీలు అవుతున్నాయని, మళ్లీ వారే కరువయ్యారని ఉన్న వారితోనే సర్దుకుపోవాల్సి వస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
నిధుల గోల్‌మాల్‌పై త్వరలో విచారణ
అనంతసాగరం పీహెచ్‌సీలో అభివృద్ధి నిధుల గోల్‌మాల్‌పై త్వరలో విచారణ చేపడతామని డీఎంహెచ్ సుధాకర్ చెప్పారు. అన్‌టైడ్, శాని టేషన్ నిధుల వినియోగంపైనా విచారణ చేపట్టనున్నామన్నారు. జనని సురక్షయోజన, జన ని శిశు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధిం చిన నిధులు కూడా లబ్ధిదారులకు సక్రమంగా అందడంలేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి భోజనం
Published Sat, Nov 23 2013 4:55 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement