ధరూరు : మండలంలోని గువ్వెలదిన్నె గ్రామంలో అతిసారవ్యాధి అదుపులోకి రావడం లేదు. తీవ్రవాంతులు, విరేచనాల తో నవీన్ అనే బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. కలుషితనీటిని తాగడంతోనే అతిసార ప్రబలినట్లు వైద్యులు, అధికారులు గుర్తించారు.
మంగళవారం మరో 20 మంది అస్వస్థతకు గురికావడంతో వారికి స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో వైద్యశిబిరం నిర్వహించి చికిత్సలు అందజే స్తున్నారు. వీరిలో సాలమ్మ, నాగమ్మ, వీరుపాక్షిల ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు వైద్యాధికారులు చెప్పారు. ఇన్‌చార్జి తహశీల్దార్ శ్రీనివాసులు, డాక్టర్ రాఘవేంద్ర, ఈఓపీఆర్డీ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి గోపాల్‌నాయక్ గ్రామంలోనే ఉంటూ వైద్యసేవలను పర్యవేక్షిస్తున్నారు. కాచివడబోసిన నీటిని తాగాలని గ్రామస్తులకు సూచిస్తున్నారు.
అతిసారబాధితులకు ఎమ్మెల్యే డీకే అరుణ పరామర్శ
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాలను కాపాడుకోవాలని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. మంగళవారం ఆమె మండల పరిధిలోని గువ్వలదిన్నె గ్రామాన్ని సందర్శించి అతిసార బాధిత కుటుంబాలను పరామర్శించారు. అతిసార మృతి చెందిన నవీన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో మురుగు నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితి అదుపులోకి తీసుకు వచ్చే వరకు వైద్యశిబిరాలు కొనసాగించాలని, ట్యాంకర్లతో తాగునీటి సరఫరా చేయూలని ఆదేశించారు.
టీఆర్‌ఎస్ నాయకుల పరామర్శ...
మండల టీఆర్‌ఎస్ నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అతిసారతో మృతి చెందిన నవీన్ అంత్యక్రియలకు జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వరరెడ్డి రూ.5 వే లు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
అదుపులోకిరాని అతిసార
Published Wed, Jul 2 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM
Advertisement
Advertisement