తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ సోమవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్ : తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ సోమవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదాయ పరిమితి పెంచుతూ మార్గదర్శకాల నేపథ్యంలో రేషన్ కార్డులు, పెన్షన్ల దరఖాస్తుల పున పరిశీలపై ఆయన అధికారులతో సమీక్షించారు. సమీక్ష సమావేశానికి గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సెర్ప్ సీఈవో మురళీ తదితరులు హాజరయ్యారు.
మరోవైపు 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల నిధుల వివాదంపై కూడా రాజీవ్ శర్మ సమీక్షించారు. ఆరోగ్యశ్రీ సీఈవో ధనుంజయ్ రెడ్డి, వివిధ శాఖల పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.