హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఐదో రోజు సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో నెలకొన్ని కరువు సమస్యలు, మంచినీటి సమస్యలపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. కాగా స్పీకర్ కోడెల్ శివప్రసాద రావు ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.