19 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు | Andhra Pradesh Assembly's first session will start from June 19 at Hyderabad | Sakshi
Sakshi News home page

19 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు

Published Sun, Jun 15 2014 10:57 AM | Last Updated on Sat, Jun 2 2018 4:30 PM

Andhra Pradesh Assembly's first session will start from June 19 at Hyderabad

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల తేదీలు ఖరారైయ్యాయి. ఈ నెల 19 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.  అందులోభాగంగా ఈ నెల 19న శాసనసభలో చంద్రబాబు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అలాగే మరుసటి రోజు అంటే 20వ తేదీన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. 21న సభలో గవర్నర్ నరసింహన్ శాసనసభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారు.

 

22వ తేదీన అసెంబ్లీ సెలవు. దాంతో 23, 24 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతోపాటు సీఎం చంద్రబాబు సభలో ప్రసంగించనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ఇప్పటికే పి.నారాయణస్వామి నాయుడు పేరు ఖరారు అయిన సంగతి తెలిసిందే. దాంతో ఈ నెల18న ప్రొటెం స్పీకర్గా నారాయణ స్వామి నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement