
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. బుధవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఎన్‌పీఆర్‌లోని కొన్ని అంశాలపై మంత్రివర్గం చర్చించింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్, రామాయపట్నం పోర్టు నిర్మాణాలపై సమావేశంలో చర్చించారు. దీంతో పాటు ఉగాదికి 25లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీపై సన్నద్ధత, ఓడరేవుల నిర్మాణం, బడ్జెట్, ఆర్థిక విధివిధానాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.