
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంజనీరింగ్, ఫార్మా, పీజీ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన విద్యార్థులందరికి ఈ ఏడాది నుంచి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఇంజనీరింగ్, ఫార్మా, పీజీ కాలేజీల్లో ఫీజులపై నిపుణులతో కూడిన కమిటీ అధ్యాయనం చేస్తున్నట్లు పేర్కొంది. నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకూ తాత్కలిక ఫీజుల విధానం అమల్లో ఉంటుందని పేర్కొంది.
ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం తాత్కాలిక ఫీజుల ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో భాగంగా గతేడాది వసూలు చేసిన ఫీజులనే ఈ ఏడాది కూడా తాత్కాలికంగా అమలు చేయాలని నిర్ణయించింది.