
సాక్షి, అమరావతి: పలు అసెంబ్లీ కమిటీలను నియమిస్తూ గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలకు నూతనంగా చైర్మన్, సభ్యులను నియమించినట్టు పేర్కొంది. అందులో భాగంగా రూల్స్ కమిటీ చైర్మన్‌గా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమించింది.
దీంతో పాటు పిటీషన్ కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో పాటు ఆరుగురు సభ్యులను, సభ హక్కుల కమిటీ చైర్మన్‌గా కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా కొట్టు సత్యనారాయణ, ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా అంబటి రాంబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే సత్యనారాయణను నియమించటంపై ఆ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment