
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల వాతావరణం ఉందని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అమరావతిలో స్విట్జర్లాండ్ భారత రాయబార బృందంతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కావాల్సిన వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని సూచించారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందిస్తోందని తమ్మినేని సీతారాం అన్నారు. కాగా ఈ భేటిలో స్విట్జర్లాండ్‌కు చెందిన పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment