'ఏపీని ఆఫ్ఘనిస్తాన్ లా తయారు చేశారు' | andhra pradesh looks like afghanistan | Sakshi
Sakshi News home page

'ఏపీని ఆఫ్ఘనిస్తాన్ లా తయారు చేశారు'

Published Tue, Jun 16 2015 3:19 PM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

'ఏపీని ఆఫ్ఘనిస్తాన్ లా తయారు చేశారు' - Sakshi

'ఏపీని ఆఫ్ఘనిస్తాన్ లా తయారు చేశారు'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ మాదిరి తయారు చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శించారు.  రాష్ట్రంలో దొంగల రాజ్యం నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలో ఏ కార్యాలయానికి వెళ్లినా డబ్బులివ్వందే పనులు జరగడం లేదని.. అధికారుల పోస్టింగ్ ల సైతం  డబ్బులు ఇవ్వాల్సి రావడం సిగ్గుచేటన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో పక్కా ఆధారాలున్నాయి కాబట్టే చంద్రబాబుకు ఏసీబీ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతోందన్నారు.


దేశానికే కాక యావత్ ప్రపంచానికి చంద్రబాబు ఒక చీడపురుగులాంటి వాడని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆయన బురద కడుక్కునేందుకు ఢిల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని.. అయినా బాబు జైలుకు వెళ్లక తప్పదన్నారు.

అవినీతికి నిదర్శనం చంద్రబాబేనని రాజంపేట వైఎస్సార్ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. హంద్రీవా జలాలను యేడాదిలో పూర్తి చేస్తామని ఇంతవరకూ పనులే ప్రారంభించలేదన్నారు. ఓటుకు నోటు విషయంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పాత్ర ఏంటని ప్రశ్నించారు. బలం లేని చోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి దూరంగా ఉంటే..అయినా బలం లేని చోట టీడీపీ అభ్యర్థులను నిలబెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటని నిలదీశారు. అంటే తెలంగాణలో మాదిరిగా ఓట్లు కొనుగోలు చేయడానికి సిద్ధమైందని.. దీనిపై కేంద్ర నిఘా సంస్థలు కన్నెయ్యాలన్నారు.

ఓటుకు కోట్ల వ్యవహారంలో శిక్ష తప్పదనే భయంతోనే చంద్రబాబు.. కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య గౌడ్ లు అభిప్రాయపడ్డారు. సెక్షన్ -8అంటే అక్రమాలు చేయడమా?, చంద్రబాబు డైరెక్షన్ లో అంతా జరిగిందని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అరెస్ట్ అవుతానన్న భయంతోనే ఇంటి దగ్గర పోలీసులను కూడా మార్చుకున్నారన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలంతా హ్యాపీగానే ఉన్నారని.. కావాలనే రెచ్చగొడుతున్నారని వారు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement