హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాయితీల విషయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు పోరాడితే..మద్దతివ్వాలా లేదా అని తర్జనభర్జనలో ఉంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు హాజరు కానున్నారు.
నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
Published Sat, Feb 21 2015 9:28 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement