టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతల మధ్య విభేదాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శనివారం జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. హుద్ హద్ తుపాను నష్ట నివారణకు ఒక్కో ఎంపీ రూ.కోటి ఇస్తామన్నారని... కానీ ఇప్పటి వరకూ ఏమీ ఇవ్వలేదని బాబు తెలపగా దానికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభ్యంతరం తెలిపారు.
తమ ప్రాంతంలో తాగునీటి సమస్యకు ఖర్చు పెట్టాల్సి ఉందని సీఎంకు దివాకర్ రెడ్డి తెలిపారు. దీంతో జేసీ వ్యాఖ్యలతో చంద్రబాబు విభేదించారు. ప్రతి ఒక్కరూ మాట ఇచ్చారని.. తప్పకుండా రూ. కోటి చొప్పున ఇవ్వాల్సిందేనని చంద్రబాబు వారికి సూచించారు. ఎంపీలు నిధులు అందిస్తే రాష్ట్రం నుంచి మరో రూ.24 కోట్లు ఇస్తామని బాబు తెలిపారు. ఆ నిధులతో ఇళ్లు నిర్మాణం చేపట్టవచ్చని ఆయన ఎంపీలకు తెలిపారు. హుద్ హుద్ తుపాను సాయం కోసం కేంద్రం నుంచి నిధులు సాధించలేకపోయామని ఈ సందర్భంగా బాబు ఎంపీల వద్ద ప్రస్తావించారు.