Telugu Desam Parliamentary Party
-
వైఎస్ఆర్ సీపీ ఎంపీలను అడ్డుకోండి: బాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనకుండా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకోగా.. పార్లమెంట్లో కూడా ప్రత్యేక హోదాపై ఆ పార్టీ ఎంపీలు చేసే పోరాటాన్ని అడ్డుకోవాలని టీడీపీ ఎంపీలకు సూచించినట్టు తెలుస్తోంది. సోమవారం జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ ఎంపీల రాజీనామా విషయం చర్చకు వచ్చింది. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ ఎంపీలు రాజీనామా చేయకముందే.. ప్యాకేజీకి చట్ట భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. అవసరమైతే ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని, ఢిల్లీకి కూడా వచ్చి మాట్లాడుతానని చంద్రబాబు ఎంపీలతో చెప్పారు. ప్యాకేజీకి చట్ట భద్రత కల్పించేలా టీడీపీ ఎంపీలు పోరాడాలని సూచించారు. ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ సీపీ ఎంపీల పోరాటాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు పార్టీ ఎంపీలను ఆదేశించారు. -
టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభం
విజయవాడ : తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ మంగళవారమిక్కడ సమావేశమైంది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. రేపటి నుంచి (బుధవారం) జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై సభలో ప్రస్తావించడం, కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేయడంపై ఈ భేటీలో దృష్టి సారిస్తారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి హాజరయ్యారు. -
15న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
అమరావతి: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 15న(మంగళవారం) జరగనుంది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. బుధవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇందులో చర్చిస్తారు. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై సభలో ప్రస్తావించటం, కేంద్రానికి మరోమారు విజ్ఞప్తి చేయటంపై ఈ సమావేశంలో దృష్టి సారించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా జరగనుంది. -
టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతల మధ్య విభేదాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శనివారం జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. హుద్ హద్ తుపాను నష్ట నివారణకు ఒక్కో ఎంపీ రూ.కోటి ఇస్తామన్నారని... కానీ ఇప్పటి వరకూ ఏమీ ఇవ్వలేదని బాబు తెలపగా దానికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. తమ ప్రాంతంలో తాగునీటి సమస్యకు ఖర్చు పెట్టాల్సి ఉందని సీఎంకు దివాకర్ రెడ్డి తెలిపారు. దీంతో జేసీ వ్యాఖ్యలతో చంద్రబాబు విభేదించారు. ప్రతి ఒక్కరూ మాట ఇచ్చారని.. తప్పకుండా రూ. కోటి చొప్పున ఇవ్వాల్సిందేనని చంద్రబాబు వారికి సూచించారు. ఎంపీలు నిధులు అందిస్తే రాష్ట్రం నుంచి మరో రూ.24 కోట్లు ఇస్తామని బాబు తెలిపారు. ఆ నిధులతో ఇళ్లు నిర్మాణం చేపట్టవచ్చని ఆయన ఎంపీలకు తెలిపారు. హుద్ హుద్ తుపాను సాయం కోసం కేంద్రం నుంచి నిధులు సాధించలేకపోయామని ఈ సందర్భంగా బాబు ఎంపీల వద్ద ప్రస్తావించారు. -
నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాయితీల విషయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు పోరాడితే..మద్దతివ్వాలా లేదా అని తర్జనభర్జనలో ఉంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు హాజరు కానున్నారు. -
రేవంత్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వండి
స్పీకర్‌ను కోరిన టీడీపీ శాసనసభా పక్షం సాక్షి, హైదరాబాద్: టీడీపీ సభ్యుడు ఎ. రేవంత్‌రెడ్డికి శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించాలని ఆ పార్టీ శాసనసభా పక్షం స్పీకర్ మధుసూదనాచారికి విజ్ఞప్తి చేసింది. సభలో అభిప్రాయం చెప్పుకునే స్వేచ్ఛ ప్రతి సభ్యుడికీ రాజ్యాంగం కల్పించిందని, రేవంత్‌రెడ్డి మాట్లాడేందుకు ఉపక్రమించగానే అధికార పార్టీ సభ్యులు గొడవ చేయడం ఎంతవరకు సమంజసమని ఆ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, సండ్ర వెంకటవీరయ్య, జి. సాయన్న, వివేకానంద స్పీకర్‌ను కలసి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం బంజారాహిల్స్ సొసైటీ భూముల విషయమై సభలో చర్చ సందర్భంగా రేవంత్‌రెడ్డి మామకు సంబంధించిన స్థలంపైనా ప్రస్తావన వచ్చింది. అందుకు రేవంత్‌రెడ్డి తన వాదన వినిపించేందుకు లేవగానే టీఆర్ఎస్ సభ్యులు క్షమాపణ చెప్పాలంటూ గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో ఆవేశానికి గురైన రేవంత్ హెడ్‌సెట్‌ను నేలకేసి కొట్టి ఆందోళన చేయడంతో సభాపతి సభను వాయిదా వేశారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. సభలో సభ్యుడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే స్పీకర్ రూలింగ్ ఇవ్వాలి, లేదంటే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మాత్రమే నిబంధనల్లో పొందుపరిచారే తప్ప క్షమాపణ చెప్పాలని ఎక్కడా లేదని ఆయనకు రూల్ పొజిషన్‌ను చూపించారు. కాగా, క్షమాపణ చెప్పేందుకు రేవంత్‌రెడ్డి నిరాకరించారు. -
సమస్యలపై 'జన్మభూమి'లో నిలదీయండి
అనంతపురం అర్బన్: జిల్లాలో 4 నియోజకవర్గాల్లో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో సమస్యలపై టీడీపీ ప్రజాప్రతినిధులను, నాయకులను నిలదీయాలని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడారు. గురువారం నుంచి అధికార పార్టీ చేపడుతున్న జన్మభూమి కార్యాక్రమాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అదే సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు ఫైళ్లపై సీఎం తొలిసంతకం చేశారని వారు గుర్తుచేశారు. కానీ వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వచ్చేందుకు సంవత్సర కాలం పడుతుందని, టీడీపీ ప్రభుత్వం వంద రోజులకే వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా బేషరతుగా రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులను పూర్తిగా రుణ విముక్తుల గావించని తర్వాతే ప్రభుత్వం రైతుల కోసం పెట్టిన ‘రైతు సాధికారిత సంఘం’కు సార్థకత లభిస్తుందన్నారు. ఒక్కో మండలంలో వెయ్యి మంది చొప్పున అర్హులైనవారిని పింఛను పథకం నుంచి తొలగించారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. జాబితా నుంచి తొలిగించిన పింఛన్ లబ్ధిదారులు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకులను నిలదీయాలన్నారు. బాధితులకు కాంగ్రెస్ నాయకులు ఉంటారన్నారు. పింఛన్లు, రేషన్‌కార్డులు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హులను తొలిగిస్తే ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. ఇందుకు ఫిర్యాదు విభాగాన్ని ఏర్పాటు చేశామని, ఛిౌజట్ఛటట ఛిౌఝఝజ్ట్ట్ఛ్ఛీ.్చఞఃజఝ్చజీ.ఛిౌఝ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చునన్నారు.