15న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం | tdp parliamentary party meeting on 15th in vijayawada | Sakshi
Sakshi News home page

15న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Published Mon, Nov 14 2016 5:14 PM | Last Updated on Sat, Aug 11 2018 3:54 PM

tdp parliamentary party meeting on 15th in vijayawada

అమరావతి: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 15న(మంగళవారం) జరగనుంది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. బుధవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇందులో చర్చిస్తారు. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై సభలో ప్రస్తావించటం, కేంద్రానికి మరోమారు విజ్ఞప్తి చేయటంపై ఈ సమావేశంలో దృష్టి సారించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement