వైఎస్ఆర్ సీపీ ఎంపీలను అడ్డుకోండి: బాబు | tdp parliamentary party meeting held in amaravathi | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ ఎంపీలను అడ్డుకోండి: బాబు

Published Mon, Jan 30 2017 7:48 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

వైఎస్ఆర్ సీపీ ఎంపీలను అడ్డుకోండి: బాబు - Sakshi

వైఎస్ఆర్ సీపీ ఎంపీలను అడ్డుకోండి: బాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనకుండా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకోగా.. పార్లమెంట్లో కూడా ప్రత్యేక హోదాపై ఆ పార్టీ ఎంపీలు చేసే పోరాటాన్ని అడ్డుకోవాలని టీడీపీ ఎంపీలకు సూచించినట్టు తెలుస్తోంది.

సోమవారం జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ ఎంపీల రాజీనామా విషయం చర్చకు వచ్చింది. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ ఎంపీలు రాజీనామా చేయకముందే.. ప్యాకేజీకి చట్ట భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. అవసరమైతే ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని, ఢిల్లీకి కూడా వచ్చి మాట్లాడుతానని చంద్రబాబు ఎంపీలతో చెప్పారు. ప్యాకేజీకి చట్ట భద్రత కల్పించేలా టీడీపీ ఎంపీలు పోరాడాలని సూచించారు. ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ సీపీ ఎంపీల పోరాటాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు పార్టీ ఎంపీలను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement