అంగన్‌వాడీ ఆయాపై అత్యాచార యత్నం | Anganwadi ayapai molest | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ ఆయాపై అత్యాచార యత్నం

Published Sun, Mar 6 2016 3:19 AM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM

Anganwadi ayapai molest

కుందుర్పి : ఎస్. మల్లాపురంలో శుక్రవారం అంగన్‌వాడీ సెంటర్లో పనిచేస్తున్న ఆయాపై అదేగ్రామానికి చెందిన హనుమానాయక్ అత్యాచారానికి యత్నించి గాయపరచినట్లు బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘‘శుక్రవారం రోజూలాగా అంగన్‌వాడీ కేంద్రంలో విధులు నిర్వహిస్తుండగా  హనుమానాయక్ వచ్చి తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. అందుకు ప్రతి ఘటించినందుకు పక్కనే ఉన్న కట్టెతో తలపై బాదడంతో రక్తగాయాలయ్యాయి. వెంటనే చుట్టుపక్కలవారు గమనించి హనుమానాయక్ నుంచి తనను తప్పించారు. ఏడాది కాలంగా తనను హనుమానాయక్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని చెప్పింది. కాగా హనుమానాయక్ భార్య సరోజినీబాయ్ తాను అంగన్‌వాడీ హెల్పర్ చిన్నపాటి సమస్యకు  గొడవపడుతుంటే ఇడిపించేందుకు కట్టెతో ఇద్దరిని కొట్టాడని దీంతో ఆమెకు రక్తగాయమైందని, తనభర్త ఎలాంటి అత్యాచారానికి ఒడిగట్టలేదని ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement