అంగన్‌వాడీ టీచర్‌కు లైంగిక వేధింపులు | Sexual harassment for Anganwadi teacher | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ టీచర్‌కు లైంగిక వేధింపులు

Published Tue, Jul 4 2017 12:10 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

అంగన్‌వాడీ టీచర్‌కు లైంగిక వేధింపులు - Sakshi

అంగన్‌వాడీ టీచర్‌కు లైంగిక వేధింపులు

పెద్దపల్లి: అంగన్‌వాడీ టీచర్‌గా ఉద్యోగం పెట్టించాను.. నా సంగతేంటంటూ పెద్దపల్లి మండలం మూలసాల సర్పంచ్‌ భర్త కొమురయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని.. కొమురయ్యను చెప్పుతో కొట్టానంటూ సోమవారం ఓ అంగన్‌వాడీ టీచర్‌ పోలీస్టేషన్‌కు చేరుకుంది. చాలా రోజులుగా తన కోరిక తీర్చాలంటూ వెంటపడుతున్నాడని ఆమె వాపోయింది. చివరికి అసహనంతో చెప్పుతో కొట్టానని స్వయంగా బాధితురాలే పోలీస్టేషన్‌కు వెళ్లి సర్పంచ్‌ భర్తపై చర్యతీసుకోవాలని ఫిర్యాదుచేసింది.

గ్రామంలో జరిగిన సంఘటనపై పెద్దలు జోక్యం చేసుకొని ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. తిరిగి సాయంత్రం ఎస్సై జగదీశ్‌ను కలిసి ఇరువురి మధ్య రాజీ కుదిరి బాధితురాలు ఫిర్యాదు ఉపసంహరించుకుంది. కొమురయ్య మాత్రం అంగన్‌వాడీ సెంటర్‌ను పాఠశాలలోకి మార్చినందుకే తనపై కక్షగట్టి దుష్ప్రచారం చేస్తోందని వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement