విజయనగరంఫోర్ట్: అంగన్‌వాడీ పోస్టుల ఫలితాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంటర్వ్యూలు జరిగి నెల రోజులైనా ఫలితాలు వెల్లడించకపోవడంపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్వ్యూలు నిర్వహించిన రోజే ఫలితాలు వెల్లడిస్తామని ఐసీడీఎస్ అధికారులు ప్రకటించారు. కాని నెల రోజులవుతున్నా ఇంతవరకు ప్రకటించలేదు. అంగన్‌వాడీ పోస్టులను అధికార పార్టీకి చెందిన వారికి కట్టబెట్టేశారని, అందుకే ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలో పోస్టుల ఫలితాలను ప్రకటించడం, వారంతా విధుల్లో చేరిపోవడం పూర్తయింది. కానీ మైదాన ప్రాంతంలో ఉన్న పోస్టుల ఫలితాలను ప్రకటించక పోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
పోస్టుల వివరాలు
మైదాన ప్రాంతంలో 275 పోస్టులు, ఐటీడీఏ పరిధిలో 409 పోస్టులకు నియామకాలు చేపట్టారు. వాటిలో మైదాన ప్రాంతంలో 28 అంగన్‌వాడీకార్యకర్తలు, 115 హెల్పర్, 34 మిని అంగన్‌వాడీ కార్యకర్తలు, 98లింక్ వర్కర్ పోస్టులు, ఐటీడీఏ పరిధిలో 16 అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు, 55 హెల్పర్ పోస్టులు, 19 మినీ అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు, ైక్రైసీ వర్కర్ పోస్టులు 57, లింక్‌వర్కర్ పోస్టులు 262 ఉన్నాయి. మైదాన ప్రాంతంలో ఉన్న 275అంగన్‌వాడీ పోస్టులకు గత నెల 15, 16, 22 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న 409 పోస్టులకు 18,19, 20 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలోని పోస్టులకు 20 వతేదీనే ఫలితాలు వెల్లడించేశారు. కానీ మైదాన ప్రాంతంలో ఇంకా ఫలితాలు వెల్లడించలేదు. ఇదే విషయాన్ని ఐసీడీఎస్ పీడీ ఏఈరాబర్ట్స్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగామైదాన ప్రాంత ఫలితాల ఫైల్ ఇంకా కలెక్టర్ దగ్గర ఉందని, అందుకే ఇంకా వెల్లడించలేదని తెలిపారు.
అంగన్‌వాడీ ఫలితాల్లో జాప్యం
Published Wed, Mar 16 2016 11:46 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
Advertisement