మంగళవారం తాము తలపెట్టిన చలో అసెంబ్లీని విజయవంతం చేసేక్రమంలో పోలీసుల నిర్భంధాన్ని సైతం లెక్కచేయకుండా ముందుకు దూకారు అంగన్ వాడీ కార్యకర్తలు. వేలాది మంది కార్యకర్తలు ఏపీ అసెంబ్లీ అసెంబ్లీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. ఇందిరాపార్క్, ట్యాంక్ బండ్ వద్ద పెద్ద సంఖ్యలో అంగన్ వాడీ కార్యక్తల్ని అరెస్టుచేసిన పోలీసులు వారిని గాంధీనగర్ పీఎస్కు తరలించారు.
చంద్రబాబు ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ మహిళలందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అసెంబ్లీకి వచ్చే దారులన్నింటిని పోలీసులు దిగ్భందించారు. దీంతో కార్యాలయాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. మరోవైపు జిల్లాలనుంచి హైదరాబాద్ బయలుదేరిన కార్యకర్తల్ని పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుంటున్నారు. వార్షిక బడ్జెట్లో తమకు కేటాయింపులు లేవని నిరసనగా అంగన్వాడీ సిబ్బంది ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరే ఏపీ ప్రభుత్వం కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
'అంగన్ వార్' ఉద్రిక్తం
Published Tue, Mar 17 2015 8:03 AM | Last Updated on Mon, Aug 20 2018 4:37 PM
Advertisement