నెమలిగుండ్ల రంగస్వామి ఆలయంలో పూజలో రాంబాబు
సాక్షి, కాకర్ల (ప్రకాశం): వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో పాటు, తాను అత్యధిక మెజారిటీతో గిద్దలూరు నియోజకవర్గం నుంచి గెలిచిన సందర్భంగా తిరుమలకు కాలినడకన వెళ్లి మొక్కు చెల్లించుకొనేందుకు ఎమ్మెల్యే అన్నారాంబాబు తలపెట్టిన పాదయాత్ర బుధవారం మండలంలోని కాకర్ల గ్రామం నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. గ్రామంలోని నెమలిగుండ్ల రంగస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు పూజలు చేసి ప్రారంభించారు. రాంబాబు కుటుంబ సభ్యులు, స్నేహితులు, పార్టీ నాయకులు, శ్రేయోభిలాషుల మధ్య పూజలు నిర్వహించారు. గ్రామంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంగాళమ్మ, వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం గ్రామంలో తిరిగి ప్రజల ఆశీర్వాదాలు తీసుకున్నారు.
అన్నారాంబాబు పాదయాత్రకు సంఘీభావంగా అర్ధవీడు, కంభం, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, గిద్దలూరు మండలాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలు పాల్గొన్నారు. పాదయాత్రకు గ్రామానికి వందలాది కార్లు, మోటార్‌బైక్‌లలో అభిమానులు తరలివచ్చారు. అర్ధవీడు, బేస్తవారిపేట, గిద్దలూరు, ఎంపీపీలు నన్నెబోయిన రవికుమార్, వేగినాటి ఓసూరారెడ్డి, చేరెడ్డి వంశీధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు చేగిరెడ్డి సుబ్బారెడ్డి, ఆవులయ్య, పుల్లారెడ్డి, నాగిరెడ్డి పాండురంగారెడ్డి (సాగర్) ఎండేల వెంకటేశ్వరరెడ్డి, ఏరువ కృష్ణారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, వివిధ మండలాల నుంచి వైశ్య ప్రముఖులు, ³లు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మాగుటూరు గ్రామానికి చెందిన నాయక్ అనే వైఎస్సార్ సీపీ అభిమాని పార్టీ జెండా రంగుతో తన ఒంటిపై జగన్‌అన్న, రాంబాబు అన్న చలో తిరుమల పాదయాత్ర అనే నినాదాలు రాసుకొని తిరగడం ఆకట్టుకుంది. కాకర్ల నుంచి నడుచుకుంటూ నాగులవరం మీదుగా నరవ వద్దకు చేరుకున్న అన్నా రాంబాబుకు, ఆయన అనుచరులకు అక్కడ భోజనానికి ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment