తెలంగాణ ప్రజలపై రాయల తెలంగాణ అంశాన్ని రుద్దితే మరో ప్రజా ఉద్యమం తప్పదని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలపై రాయల తెలంగాణ అంశాన్ని రుద్దితే మరో ప్రజా ఉద్యమం తప్పదని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ హెచ్చరించారు. రాష్ట్ర విభజన గురించి కాకుండా.. అసలు విభజనే వద్దంటూ చర్చించాలని చెబితే మాత్రం అసలు తాము చర్చల్లోనే పాల్గొనేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇద్దరు పెద్దమనుషులం కూర్చుని రాష్ట్ర విభజన అంశంపై మాట్లాడుకున్నామంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని దేవీప్రసాద్ తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తప్ప మరేదీ తమకు సమ్మతం కానే కాదని ఆయన స్పష్టం చేశారు.