గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలిన దుర్ఘటనలో మరో వ్యక్తి మృతి | Another person died in Gas pipeline explosion | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలిన దుర్ఘటనలో మరో వ్యక్తి మృతి

Published Sat, Jun 28 2014 4:57 PM | Last Updated on Tue, Jun 4 2019 6:34 PM

గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలిన దుర్ఘటనలో మరో వ్యక్తి మృతి - Sakshi

గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలిన దుర్ఘటనలో మరో వ్యక్తి మృతి

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్‌ పైప్‌లైన్‌లో పేలిన  దుర్ఘటనలో మరో వ్యక్తి మృతి చెందారు. దాంతో  మృతులసంఖ్య 17కు చేరింది.  ఈ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓఎన్జీస్‌ గ్యాస్‌ స్టేషన్‌ సమీపంలో గెయిల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌లో పేలుడు సంభవించి 16 మంది సజీవ దహనమయిన విషయం తెలిసిందే.  ఈ ప్రమాదంలో మరో 30 మంది తీవ్రంగా గాయపడి వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  రాయుడు సూర్యనారాయణ ఈ రోజు మృతి చెందారు. పైప్లైన్ పేలిన ఘటనలో కోనసీమలోని పచ్చని  నగరం గ్రామం కాలిబూడిదైపోయింది. కొబ్బరి చెట్లు నిట్టనిలువునా తగలబడిపోయాయి. ఇళ్లన్నీ  కాలిపోయి గ్రామం శ్మశానవాటికను తలపిస్తోంది.ఇంకా 29 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారి బాధ వర్ణనాతీతం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement