సాక్షి ప్రతినిధి, కాకినాడ : పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపాన గోదావరిలో లాంచీ దుర్ఘటనలో 19మంది మృతి చెందినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఒక్కరు గల్లంతుకాగా అతని కోసం గాలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 17మంది ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. జియో సంస్ధతో ఒప్పందం చేసుకుని ఏజెన్సీలో నలభై ఏడుచోట్ల టవర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మంటూరు నుండి కొండమొదలు వరకు బండి బాట నిర్మించేందుకు సిఎం ఆదేశాల మేరకు ప్రయత్నాలు ప్రారభిస్తామని, గోదావరిలో ప్రయాణికుల తరలింపుకు... సామాగ్రి తరలింపుకు వేరు వేరు సర్వీసు లాంచీలు నడుస్తాయన్నారు. ప్రస్తుతం పోలవరం ఎగువకు వెళ్ళే అన్ని రకాల సర్వీసు లాంచీలను నిలివేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
కాగా గురువారం మరో మూడు మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికితీసినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, నౌకా సిబ్బంది, స్థానికుల సహకారంతో వాడపల్లి, మంటూరు పరిసర ప్రాంతాల్లో బోట్ల సాయంతో గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. కాగా ఎన్‌డీఆర్‌ఎఫ్, నావీ సిబ్బంది ఇరవై గంటల అనంతరం నదిలో మునిగిన లాంచీని భారీ క్రేన్‌ల సాయంతో వెలికితీసిన విషయం విదితమే. లాంచీ పూర్తిగా నేలపైకి రావడానికి వీలుకాక పోవడంతో నేవీ సిబ్బంది లాంచీ భాగాలను కత్తిరించి మృతదేహాలను బయటికి తీశారు.
.
Comments
Please login to add a commentAdd a comment