సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు పట్ల సభాపతి తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వద్ద మార్షల్స్‌తో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా టీడీపీ సభ్యులు గొడవపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఘటనకు సంబంధించిన వీడియోను అసెంబ్లీలో ప్లే చేశారు. ఇందులో... ‘ఓ ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుంది’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యుల సభలో గందగోళం సృష్టించేందుకు ప్రయత్నించగా.. స్పీకర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు క్షమాపణ చెబుతారా లేదా అన్నది మీ విఙ్ఞతకే వదిలేస్తున్నా. క్షమాపణ చెప్పకపోతే ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తాం. సభ బయట జరిగిన విజువల్స్ తెప్పించుకుంటా. అంతేగానీ ఎప్పుడు పడితే అప్పుడు విచారణ అంటే ఎలా. వాస్తవాల ఆధారంగా నిర్ణయం ప్రకటిస్తాం’అని స్పీకర్ స్పష్టం చేశారు.
చంద్రబాబుకు మానవత్వం లేదు: సీఎం జగన్
ఓ ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు క్షమాపణ అడుగుతారని ఆశించడం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబుకు మానవత్వం లేదని.. క్షమాపణ చెప్పడాన్ని ఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. అవాస్తవ కథనాలపై చర్యలు తీసుకునేందుకు తీసుకువచ్చిన జీవోలో ఎటువంటి తప్పులేకపోయినా టీడీపీ రాద్ధాంతం చేసిందని మండిపడ్డారు. జీవోలో ఎటువంటి తప్పులేకపోయినా టీడీపీ రాద్ధాంతం చేసి.. సభా సమయాన్ని వృథా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment