వెంకయ్యపై పవన్‌ విమర్శలు దారుణం | ap bjp fired on pawan kalyan comments | Sakshi
Sakshi News home page

వెంకయ్యపై పవన్‌ విమర్శలు దారుణం

Published Sat, Jan 28 2017 3:23 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

వెంకయ్యపై పవన్‌ విమర్శలు దారుణం - Sakshi

వెంకయ్యపై పవన్‌ విమర్శలు దారుణం

ఆయన వెనుకాల కాంగ్రెస్, కమ్యూనిస్టు శక్తులు: ఏపీ బీజేపీ
సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వ్యక్తిగత విమర్శలకు దిగడం నీచాతినీచమని ఏపీ బీజేపీ శాఖ ధ్వజమెత్తింది. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి యడ్లపాటి రఘునాథ్‌బాబు విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు శక్తులు పవన్‌ వెనకాల ఉండి ఆయనతో లేనిపోని విమర్శలు చేయిస్తున్నాయన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో ఏ ఇతర రాజకీయ పార్టీ మాట్లాడకపోయినా ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది బీజేపీ, వెంకయ్యేనన్నారు. మారిన పరిస్థితుల కారణంగా ఇప్పుడు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాక ప్యాకేజీని ప్రకటించిందన్నారు. వెంకయ్య కృషి వల్లే ఏపీకి 60 ఏళ్లుగా జరగని అభివృద్ధి పనులను మూడేళ్లలో మంజూరయ్యాయన్నారు. పని చేసే వ్యక్తిపై విమర్శలు చేయడమంటే సాయం చేసే చేతిని నరుక్కున్నట్టేనని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement