-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి రంగరాజు
గుంటూరు (రైలుపేట)
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి, భారతీయ జనతా పార్టీకి క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి రంగరాజు డిమాండ్ చేశారు. సోమవారం గుంటూరు అరండల్‌పేటలోని బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న వె ంకయ్యనాయుడి గురించి పవన్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. రాజకీయ శూన్యతతో, అవగాహన లేకుండా మాట్లాడారన్నారు. పవన్‌కల్యాణ్ ఆత్మ ఎక్కడుందో తెలియకుండా కాకినాడ ఆత్మగౌరవ సభలో మాట్లాడారని ఎద్దేవా చేశారు. బీజేపీ నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు మాట్లాడుతూ పవన్ ప్రత్యేక ప్యాకేజీపై అవగాహన లేకుండా మాట్లాడారన్నారు. దీనిపై ఏవైనా సందేహాలుంటే రాష్ట్ర నేతలు ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్తారని, ఆ తర్వాతే మాట్లాడాలని సూచించారు. కేంద్రం, రాష్ట్రంలో తమ పార్టీ, మిత్రపక్షం అధికారంలోకి వచ్చేందుకు పవన్‌కల్యాణ్ కృషి చేశారని, సాంకేతిక కారణాల వల్ల ప్రత్యేక హోదా ఇవ్వటానికి వీలుపడడం లేదన్నారు. సమావేశంలో పార్టీ నగర ప్రధాన కార్యదర్శి చెరుకూరి తిరుపతిరావు, ఉపాధ్యక్షుడు అప్పిశెట్టి రంగా పాల్గొన్నారు.
బీజేపీకి పవన్ క్షమాపణ చెప్పాలి
Published Mon, Sep 12 2016 8:46 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement