16కు చేరిన మృతుల సంఖ్య | AP bus accident: Toll rises to 16 | Sakshi
Sakshi News home page

16కు చేరిన మృతుల సంఖ్య

Published Mon, Jan 12 2015 12:17 PM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

AP bus accident: Toll rises to 16

అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద మృతుల సంఖ్య 16 కు చేరింది. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బస్సు డ్రైవరు గంగప్ప(42)  సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు మృతిచెందాడు. దీంతో మృతుల సంఖ్య 16 కు చేరింది. పెనుకొండ సీఐ రాజేంద్రయాదవ్ తెలిపిన వివరాల మేరకు.. ఏపీఎస్ఆర్టీసీ బస్సు 50 మంది ప్రయాణికులతో మడకశిర నుంచి పెనుకొండకు బయలుదేరింది.  పెనుకొండ సమీపంలోకి రాగానే అటుగా వస్తున్న ఆటోను తప్పించబోయిన బస్సు రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిన సంగతి తెలిసిందే. ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. మృతిచెందిన వారిలో 10 మంది చిన్నారులు ఉన్నారు. 30 మందికి పైగా క్షతగాత్రులు బెంగళూరు, అనంతపురం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్నట్టు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement