అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే.. రాజీనామా బాటలో మరొకరు | ap cabinet reshuffle: tdp mlas angry | Sakshi
Sakshi News home page

అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే.. రాజీనామా బాటలో మరొకరు

Published Sun, Apr 2 2017 11:10 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే.. రాజీనామా బాటలో మరొకరు - Sakshi

అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే.. రాజీనామా బాటలో మరొకరు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ అధికార టీడీపీలో తీవ్ర అసంతృప్తి రాజేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కల్పించనందుకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అలిగారు. పార్టీ కోసం పనిచేస్తున్నా మంత్రి పదవి ఇవ్వరా అని ఆక్రోశం వ్యక్తం చేశారు. బోండా ఉమాను బుజ్జగించేందుకు ఎంపీ కేశినేని నాని, కొనకళ్ల నారాయణ రంగంలోకి దిగారు. బోండా రాజీనామా చేయడానికి సిద్ధపడినట్టు సమాచారం. చంద్రబాబు కాపుల గొంతు కోశారని ఆయన సన్నిహితుల వద్ద వాపోయారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. చంద్రబాబు కేశినేనికి ఫోన్ చేసి బోండా ఉమను తన వద్దకు తీసుకురావాలని చెప్పారు.

విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి టీడీపీ వైఖరిపై అలకబూనారు. ఆయన గన్‌మెన్‌లను వదిలిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక సీనియర్ ఎమ్మెల్యే గౌతు శివాజీకి మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన కూతురు శిరీష.. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. చాలా జిల్లాల్లో టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిరాయింపుదారులకు పెద్దపీట వేసి, సీనియర్లను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement