అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని | AP capital with international standards says CM Chandrababu | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని

Published Fri, Nov 28 2014 1:49 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని - Sakshi

అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని

జపాన్: 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం జపాన్లో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన వసతులు, వనరులను చంద్రబాబు ఈ సందర్భంగా మీడియాకు వివరించారు.

రాజధాని నిర్మాణానికి సేవలందించాలని చంద్రబాబు ఈ సందర్భంగా మీడియాకు విజ్ఞప్తి చేశారు.  రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో వివరించిన సంగతిని ఈ సందర్భంగా ఆయన విశదీకరించారు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాలు అందిస్తామని బాబు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement