
సాక్షి, కృష్ణాజిల్లా : ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ పర్యటనను ముగించుకొని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖరరావు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధ్య ప్రగతిభవన్‌లో నిన్నటి రోజున సుమారు నాలుగు గంటల పాటు భేటీ కొనసాగిన విషయం తెలిసిందే. వీలైనంత తక్కువ భూసేకరణతో, తక్కువ నష్టంతో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం, జలాల తరలింపు, నీటి వినియోగం వంటి రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.