సాక్షి, విశాఖపట్నం: కరోనా నేపథ్యంలో పోలీసుల కృషి అభినందనీయమని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. డీజీపీ సవాంగ్ ఆదివారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో పోలీసులు అద్భుతమైన పనితీరు ప్రదర్శించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు ఎంతో కృషి చేశారు. విశాఖలో మొదటి మూడు నెలలలో 98 పాజిటివ్ కేసుల మాత్రమే నమోదు అయ్యాయి. (కోవిడ్–19 మరణాలు తగ్గించేలా చర్యలు)
జూన్ నుంచి కరోనా కేసులు పెరిగాయి. పోలీస్ శాఖలో ఇప్పటివరకూ 466 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రం మరింత అప్రమత్తంగా ఉంది. ముందుండి పని చేస్తున్న సిబ్బందికి మరిన్ని జాగ్రత‍్తలు తీసుకుంటున్నాం. కరోనానను ఎదుర్కొనటంలో ఏపీ పోలీస్ శాఖ ఛాలెంజింగ్‌గా తీసుకుంది’ అని తెలిపారు. (ఆ ఔషధం ట్రయల్స్ నిలిపివేత: డబ్ల్యూహెచ్‌వో)
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావో ప్రభావిత ప్రాంతాల్లో గంజాయి సాగవుతోంది. ఆదాయం సమకూర్చుకోవడానికి మావోయిస్టులే గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారు.సెబ్ గంజాయి సాగుపై ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో ఎక్సైజ్ సిబ్బంది కూడా గంజాయి సాగు నియంత్రణకు ఆయుధాలు ఇవ్వాలనే ఆలోచన వచింది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర బలగాలు ఆయుధాలతో నిఘా ఉన్నాయి. కోవిడ్ లాక్‌డౌన్ కాలంలో గంజాయి వ్యాపారం రిలాక్స్ అయింది.
విశాఖ డ్రగ్స్ రాకెట్ కేసులో పట్టుబడిన నిందితుల్లో గత రేవ్ పార్టీలో పట్టుబడిన నిందితుడే. గతంలో గోవా, బెంగుళూర్ నుండి డ్రగ్స్ సరఫరా జరిగేది. ప్రస్తుతం గోవా లాక్‌డౌన్‌తో బెంగుళూరు నుండి సరఫరా అవుతున్నట్లు గుర్తించాం. ఇటీవల విజయవాడ డ్రగ్స్ రాకెట్ కేసులో కూడా బెంగుళూరు నుండి సరఫరా అయినట్లు గుర్తించాం. ఇక విభజన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గ్రేహౌండ్స్ కోసం 384 ఎకరాలను విశాఖపట్నంలోని ఆనందపురంలో కేటాయించింది. అక్కడ స్థల పరిశీలన చేశాం. తర్వలోనే నిర్మాణం చేపడతాం. దేశంలోనే ఏపీ గ్రేహౌండ్స్ ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నది మా ఉద్దేశ్యం. (ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు)
కాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ నిన్న (శనివారం) విశాఖలో సుడిగాలి పర్యటన చేశారు. రుషికొండలోని ఐటీ సెజ్ ప్రాంతం, పనోరమా హిల్స్ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కైలాసగిరి వద్ద గల జిల్లా రూరల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించి సిబ్బంది, అధికారులతో సమావేశం అయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గిరిజన యువతకు ఉపాధి కల్పన, గిరిజన ప్రాంత అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment