
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో దేశవ్యాప్తంగా మెరుగైన స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రైవేటు ల్యాబుల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు అనుమతినిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (ఎన్‌ఏబీటీసీఎల్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గుర్తించిన ల్యాబుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయొచ్చునని తెలిపింది. ఇక శుక్రవారం ఉదయం నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లక్షల 22 వేల 93 కోవిడ్ పరీక్షలు చేశారు.
(చదవండి: ఆ రోగుల్లో సగం మంది మహమ్మారిని జయించారు)
Comments
Please login to add a commentAdd a comment