సాక్షి, అమరావతి: కోవిడ్–19 సోకిన వారికి అవసరమైన మందుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేసింది. బాధితులకు ఇష్టారాజ్యంగా కాకుండా ఐసీఎంఆర్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించిన మేరకే ఏ స్థాయిలో మందులు వాడాలో ఈ మార్గదర్శకాల్లో వివరించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కేఎస్ జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వాస్పత్రులు, ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ఆస్పత్రులు, కోవిడ్ పాజిటివ్ బాధితులకు వైద్యమందించే ప్రైవేటు ఆస్పత్రులు ఈ మార్గదర్శకాలను అనుసరించి మందులు వాడాలని సూచించారు. వీటికి నిర్ణయించిన ధరను మాత్రమే వసూలుచేయాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మందుల వివరాలివీ..
► సైటోకైన్ స్టార్మ్ సిండ్రోం ఉన్న దశలో తోసిలిజుమాంబ్ ఇంజక్షన్ వాడాలి.
► తీవ్రత తక్కువగా ఉన్న కోవిడ్ కేసులకు ఫావిపిరావిర్ మాత్రలు ఇవ్వాలి.
► తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న రోగులకు రెమిడెసివిర్ ఇవ్వాలి.
► సెప్సిస్ లేదా సెప్టిక్ షాక్ వంటి పరిస్థితుల్లో మెరొపెనం ఇంజక్షన్‌ను ఇవ్వాలి.
ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్ మేరకే డోసులు
కాగా, ఈ మందులకు ఐసీఎంఆర్ లేదా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అనుమతులు విధిగా ఉండాలి. ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్ మేరకు ఎన్ని డోసులు ఇవ్వాలో అంతకే ఆరోగ్యశ్రీ చెల్లిస్తుంది. అంతకంటే ఎక్కువ డోసులు వేస్తే చర్యలు ఉంటాయి.
కరోనా మందుల వాడకానికి మార్గదర్శకాలు
Published Tue, Jul 21 2020 5:28 AM | Last Updated on Tue, Jul 21 2020 5:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment