పట్టిసీమ ప్రాజెక్టుపై జీవో విడుదల చేసిన ప్రభుత్వం | ap government released go on pattiseema project | Sakshi
Sakshi News home page

పట్టిసీమ ప్రాజెక్టుపై జీవో విడుదల చేసిన ప్రభుత్వం

Published Fri, Mar 27 2015 8:57 PM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM

ap government released go on pattiseema project

హైదరాబాద్:పట్టిసీమ ప్రాజెక్టు అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసింది. 14 మీటర్ల కంటే ఎక్కువ స్థాయిలో నది ప్రవహిస్తున్నప్పుడే పట్టిసీమ నుంచి నీటిని తరలించాలని ఆ జీవోలో పేర్కొన్నారు. రబీ సీజన్ లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేయకూడదని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

 

కాటన్ బ్యారేజ్ లో నీటి నిల్వ 14 మీటర్ల కంటే తక్కువ ఉన్నప్పుడు నీటిని తరలించకుండా ఉండాలని పేర్కొన్నారు. ఈ షరతులన్నీ పాటించాకే పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement