సాక్షి, విజయవాడ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం విజయవాడలోని రాజ్‌భవన్ దర్బార్‌హాల్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని రూపుదిద్దిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు యావత్ భారతదేశం కృతజ్ఞతలు తెలుపుతోంది.
గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడిగా, పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా ఆయన దేశ ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా ఉంటారని' పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా.. కరోనా నేపథ్యంలో అతి నిరాడంబరంగా, సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. చదవండి: అంబేడ్కర్‌కు సీఎం జగన్ ఘన నివాళి
Comments
Please login to add a commentAdd a comment