సాక్షి, తాడేపల్లి: కరోనా వైరస్ (కోవిడ్-19) నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలోని కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ డా. కెఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 14 రోజులు అయ్యాక మళ్లీ శాంపిల్ పరీక్షించి డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దు అని జవహర్‌రెడ్డి సూచించారు. అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాస్క్‌లు,శానిటైజర్ల కొరత రానివ్వమని ఆయన పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు యుద్థ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని జవహర్‌రెడ్డి అన్నారు. కరోనాపై నిరంతరం సమీక్షిస్తున్నాం, ప్రజలు ఆందోళన పడోద్దని ఆయన సూచించారు. కరోనా అనుమానితుల సమాచారాన్నికంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలన్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 0866-2410978 కి కాల్ చేయాలని జవహర్‌రెడ్డి కోరారు. (ఆ రోజు ఎవరూ నా దగ్గరకి రావొద్దు :మోహన్‌బాబు)
వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలన్నారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయాలని చెప్పారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి ఏపీకి వచ్చిన 852 మంది ప్రయాణికులను గుర్తించామని ఆయన వెల్లడించారు. 580 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారని తెలిపారు. 250 మందికి 28 రోజుల పరిశీలన పూర్తైందని జవహర్‌రెడ్డి అన్నారు. 22 మంది ఆస్పత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారని.. వంద మంది నమూనాలు ల్యాబ్‌కు పంపామని.. 99 మందికి నెగటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు. తొమ్మిది మంది శాంపిల్ రిపోర్టులు రావల్సి ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు వ్యాధి లక్షణాలున్నా, లేకున్నాబయటకు వెళ్లొద్దని జవహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. 108 వాహనంలోనే ఆస్పత్రికి వెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ డా. కెఎస్ జవహర్‌రెడ్డి సూచించారు. (ఐపీఎల్‌కు ఆసీస్ ఆటగాళ్లు గుడ్ బై!)
Comments
Please login to add a commentAdd a comment