రాజమహేంద్రవరం: పాలిసెట్‌లో విద్యార్థులు తమకు కావాల్సిన కోర్సులను, కళాశాలలను ఎంపిక చేసుకునే ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమవుతుందని బొమ్మూరు జీఎంఆర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.విలియం క్యారీ తెలిపారు. బుధ, గురువారాల్లో 1 నుంచి 30,000 వరకూ ర్యాంకు పొందిన విద్యార్ధులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని కోరారు.
విద్యార్ధులకు వచ్చిన పాస్‌వర్డ్‌ను గోప్యంగా ఉంచాలని, పరిచయం లేనివారికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేయరాదని సూచించారు. కాగా, కళాశాలలో మంగళవారం జరిగిన పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో 180 మంది విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. బుధవారం జరిగే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 30,001 నుంచి 45,000 ర్యాంకు వరకూ ఉన్న విద్యార్థులు హాజరుకావాలని ప్రిన్సిపాల్ తెలిపారు.