
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మూడు మాస్కులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూపిన మార్గానికి దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 16 కోట్ల మాస్కుల పంపిణీ ప్రపంచంలో ఎక్కడా జరగలేదని తెలిపారు. కరోనాపై బ్రహ్మాస్త్రం ఇది. అతితక్కువ ప్రాణ నష్టంతో ఏపీ సేఫెస్ట్ ప్లేస్ అవుతుందని విజయసాయిరెడ్డి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మూడు మాస్కులు అందజేయాలని సిఎం జగన్ గారు చూపిన మార్గానికి దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. 16 కోట్ల మాస్కుల పంపిణీ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కరోనాపై బ్రహ్మస్త్రం ఇది. అతితక్కువ ప్రాణ నష్టంతో ఏపీ సేఫెస్ట్ ప్లేస్ అవుతుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 13, 2020
‘ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంటుంది. ఎప్పుడే నిర్ణయం తీసుకోవాలో ఆ విచక్షణాధికారం ఉంటుంది. కరోనా నివారణ కోసం ఏ రాష్ట్రం అమలు చేయని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఎల్లో మీడియాకు, పచ్చ మేధావులకు ఇవేమీ కనిపించవు. నిమ్మగడ్డ పదవీకాలం ముఖ్యమైపోయింది వీళ్లకు. సిగ్గులేని బతుకులు’ అని టీడీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు.
ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంటుంది. ఎప్పుడే నిర్ణయం తీసుకోవాలో ఆ విచక్షణాధికారం ఉంటుంది. కరోనా నివారణ కోసం ఏ రాష్ట్రం అమలు చేయని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఎల్లో మీడియాకు, పచ్చ మేధావులకు ఇవేమీ కనిపించవు. నిమ్మగడ్డ పదవీకాలం ముఖ్యమైపోయింది వీళ్లకు. సిగ్గులేని బతుకులు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 13, 2020
‘సెంట్రల్ కేబినెట్ సెక్రటరీకి ఫోన్ కలుపు, ఏపీ సీఎస్‌ను మాట్లాడమను, హెల్త్ సెక్రటరీ రిపోర్టేదీ? తక్షణం మీడియా కాన్ఫరెన్సు అరేంజ్ చేయండి. చంద్రబాబు పలవరింతలివన్నీ. ఆయన మానసిక పరిస్థితి బాగా దిగజారిందంటున్నారు. కరోనా తీవ్రత తగ్గేలోగా సీరియస్ అవుతుందని టెన్షన్ పడుతున్నారట!’ అని మరో పోస్ట్‌లో చంద్రబాబునాయుడుని ఉద్దేశించి సెటైర్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment