
'బాబు ప్రభుత్వం చేతకాని తనం వల్లే..'
అనంతపురం: మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా పై ఆంధ్రప్రదేశ్ ప్రజలని మోసం చేసిందని ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి మండిపడ్డారు. హిందూపురంలో జరిగిన మట్టి సత్యాగ్రహంలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ప్రాణ వాయువవులాంటిదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేతకాని తనం వల్లే ప్రత్యేక హోదా ఇంకా రాలేదని ఆయన ధ్వజమెత్తారు.