ఆప్కాబ్ చైర్మన్‌గా పిన్నమనేని! | Apkab chairman pinnamaneni! | Sakshi
Sakshi News home page

ఆప్కాబ్ చైర్మన్‌గా పిన్నమనేని!

Published Fri, Apr 10 2015 12:25 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

Apkab chairman pinnamaneni!

  • సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్
  • సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(ఆప్కాబ్) నూతన పాలక మండలి ఎన్నిక శుక్రవారం హైదరాబాద్ నారాయణగూడ ఆప్కాబ్ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికల అధికారి తేజోమయి ఎన్నిక నిర్వహిస్తారు. ప్రస్తుత డెరైక్టర్లలో ఎక్కువ మంది టీడీపీ వారే ఉండడంతో ఆ పార్టీకి చెందిన డెరైక్టరే అధ్యక్ష పోస్టుకు ఎన్నికయ్యే అవకాశముంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అధ్యక్ష పదవికి కృష్ణా జిల్లాకు చెందిన పిన్నమనేని వెంకటేశ్వరరావు ఎన్నిక  కానున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు  ఆమోదముద్ర వేశారు. గుంటూరుకు చెందిన పార్టీ సీనియర్ నేత ముమ్మనేని వెంకటసుబ్బయ్య చేసిన ప్రయత్నం ఫలించలేదు.
     
    ఏమిటీ శిక్ష?: ముమ్మనేని ఆవేదన

    పార్టీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడంలో వెనకబడిపోయానని, నిజంగా చెప్పాలంటే తాను రాజకీయంగా చచ్చిపోయినట్టేనని ఆప్కాబ్ చైర్మన్ పదవి ఆశించి భంగపడిన ముమ్మనేని వెంకటసుబ్బయ్య తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement