Andhra Pradesh State Co-operative Bank Ltd
-
ఆప్కాబ్ చైర్మన్‌గా పిన్నమనేని!
సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(ఆప్కాబ్) నూతన పాలక మండలి ఎన్నిక శుక్రవారం హైదరాబాద్ నారాయణగూడ ఆప్కాబ్ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికల అధికారి తేజోమయి ఎన్నిక నిర్వహిస్తారు. ప్రస్తుత డెరైక్టర్లలో ఎక్కువ మంది టీడీపీ వారే ఉండడంతో ఆ పార్టీకి చెందిన డెరైక్టరే అధ్యక్ష పోస్టుకు ఎన్నికయ్యే అవకాశముంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అధ్యక్ష పదవికి కృష్ణా జిల్లాకు చెందిన పిన్నమనేని వెంకటేశ్వరరావు ఎన్నిక కానున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. గుంటూరుకు చెందిన పార్టీ సీనియర్ నేత ముమ్మనేని వెంకటసుబ్బయ్య చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఏమిటీ శిక్ష?: ముమ్మనేని ఆవేదన పార్టీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడంలో వెనకబడిపోయానని, నిజంగా చెప్పాలంటే తాను రాజకీయంగా చచ్చిపోయినట్టేనని ఆప్కాబ్ చైర్మన్ పదవి ఆశించి భంగపడిన ముమ్మనేని వెంకటసుబ్బయ్య తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణకు ‘టెస్కాబ్’
ఆప్కాబ్ విభజన.. నేటి నుంచి రెండు రాష్ట్రాలకు.. తెలంగాణ ఎండీగా నేతి మురళీధర్.. ఏపీకి నాగమల్లేశ్వర్రావు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) విభజన పూర్తయింది. ఏపీకి ఆప్కాబ్‌గానే కొనసాగనుండగా.. తెలంగాణకు తెలంగాణ స్టేట్ కో- ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టెస్కాబ్) కొత్తగా ఏర్పాటైంది. ఈ రెండు బ్యాంకులు గురువారం (ఏప్రిల్ 2వ తేదీ) నుంచి వేర్వేరుగా కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. టెస్కాబ్‌కు ఎండీగా నేతి మురళీధర్, ఆప్కాబ్‌కు నాగమల్లేశ్వర్రావు నియమితులయ్యారు. వారు గురువారం బాధ్యతలు స్వీకరిస్తారు. వారిద్దరూ ఇప్పటివరకు చీఫ్ జనరల్ మేనేజర్లు (సీజీఎం)గా వ్యవహరించారు. ఇక ఆప్కాబ్ పాలక మండలి మాత్రం తాత్కాలికంగా కొనసాగనుంది. విభజన నేపథ్యంలో ఆప్కాబ్ చైర్మన్ వీరారెడ్డి పదవీకాలం బుధవారంతో ముగిసినట్లే. దీంతో ఈ నెల 25వ తేదీలోగా టెస్కాబ్ పాలకమండలి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంది. ఏపీలో ఆప్కాబ్‌కు ఈ నెలాఖరులోగా వారిని ఎన్నుకోవాలి. మరోవైపు ఆప్కాబ్ విభజన అసెంబ్లీలో జరగాలని.. జనరల్‌బాడీ, పాలకమండలిలే చేపట్టడం నిబంధనలకు విరుద్ధమంటూ ఏపీ ఉద్యోగ సంఘాలు కోర్టుకు వెళ్లగా జోక్యానికి హైకోర్టు నిరాకరించిందని చైర్మన్ వీరారెడ్డి చెప్పారు. ఆస్తులు, ఉద్యోగుల విభజన.. 1963లో ఆప్కాబ్ ఏర్పడింది. దీనికి ఉమ్మడి రాష్ట్రంలో 37 శాఖలు ఉండగా.. విభజనతో టెస్కాబ్‌కు 35, ఆప్కాబ్‌కు రెండు శాఖలు దక్కాయి. ఆ ప్రకారమే లావాదేవీలు ఉంటా యి. టెస్కాబ్‌కు హైదరాబాద్‌లోని అబిడ్స్ సమీపంలో ఉన్న ప్రస్తుత ప్రధాన కార్యాలయాన్నే కేటాయించగా.. ఆప్కాబ్‌కు తాత్కాలికంగా నారాయణగూడలో ఉన్న కార్యాల యాన్ని ఇచ్చారు. ఆప్కాబ్‌కు 231 మంది ఉద్యోగులను, టెస్కాబ్‌కు 318 ఉద్యోగులను కేటాయించారు. అడ్వాన్సులు, డిపాజిట్లు ఏ రాష్ట్రానివి ఆ రాష్ట్రానికే చెందుతాయి. రూ. 60 కోట్ల మేరకు ఉన్న ఉమ్మడిడిపాజిట్లను జనాభా నిష్పత్తి ప్రకారం రెండు బ్యాంకులకు పంచుతారు. తెలంగాణలో ఆప్కాబ్ బ్రాంచీలు 35 ఉండగా డీసీసీబీలు 9ఉన్నాయి. డీసీసీబీలకు 249 బ్రాంచీలు ఉన్నాయి. జిల్లాల్లో ప్రాథమిక సహకార సం ఘాలు (ప్యాక్స్) 789 ఉన్నాయి. 12.50 లక్షల మంది రైతులకు రూ. 4,500 కోట్ల మేరు రుణాలు ఇచ్చారు. కాగా టెస్కాబ్‌కు ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టీఎస్సీఏబీ.ఓఆర్జీ’ వెబ్‌సైట్‌ను గురువారం ఆవిష్కరించనున్నారు. పాలకమండలికి ఎన్నికలు.. టెస్కాబ్ పాలకమండ లిలో 8 మంది సభ్యులున్నారు. అందులో ఆరుగురు కాంగ్రెస్, ఇద్దరు టీఆర్ఎస్ సభ్యులున్నారు. పాలకమండలికి ఈ నెల 25వ తేదీలోగా ఎన్నికలు జరపాలి. దీంతో ఎక్కువ సభ్యులున్న కాంగ్రెస్ పార్టీనే టెస్కాబ్ను కైవసం చేసుకునే అవకాశముంది. -
‘ఆప్కాబ్’ భవితవ్యంపై బదులివ్వలేను
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) భవితవ్యంపై వ్యక్తమవుతున్న అనుమానాలకు తన వద్ద సమాధానం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మున్ముందు ఆప్కాబ్ తీరుతెన్నులెలా ఉండబోతాయో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఆప్కాబ్ ఆవిర్భవించి 50 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని జూబ్లీహాల్లో జరిగిన స్వర్ణోత్సవ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భవిష్యతు ్తలో కూడా ఆప్కాబ్ ఇలాంటి వేడుకలను జరుపుకుంటుందా, లేక ఇదే ఆఖరుది అవుతుందా అని కార్యక్రమంలో పాల్గొన్న నాబార్డ్ చైర్మన్ ప్రకాశ్బక్షి కిరణ్‌ను ప్రశ్నించారు. ఆయన చాలా పెద్ద ప్రశ్నే అడిగారన్న కిరణ్, ప్రస్తుతం తనకు జవాబు తెలిదని బదులిచ్చారు. ఆప్కాబ్‌కు ఉజ్వల భవిష్యత్తుండాలని తాను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. తన తండ్రి అమరనాథరెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షునిగా మొదలైందని గుర్తు చేసుకున్నారు. ఉపాధి హామీ వల్ల రాష్ట్రంలో గ్రామీణ పేదలకు 100 రోజుల ఉపాధి లభిస్తోందన్న కిరణ్, అదే సమయంలో రైతులకు కూలీల ఖర్చు పెరిగిపోయి సాగు గిట్టుబాటు కాని పరిస్థితులు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. సాగులో సగటున ఎకరాకయ్యే కూలీల ఖర్చులో 30 శాతాన్ని రైతుకు అందించేలా ఉపాధి పథకాన్ని అనుసంధానించాల్సిన అవసరముందన్నారు. ముల్కనూరు సహకార సంఘాన్ని రాష్ట్రంలోని ఇతర సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రుణ అర్హత కార్డుల కాలపరిమితి పెంచాలి: బక్షి కౌలు రైతులకు బ్యాంకు రుణాలందించేందుకు జారీ చేస్తున్న రుణ అర్హత కార్డుల కాలపరిమితి ఏడాదే ఉండటంతో వారికి ఏటా రుణాలందడం కష్టమవుతోందని బక్షి అన్నారు. కౌలుదారీ చట్టాన్ని సవరించో, మరో మార్గం ద్వారానో దీర్ఘ కాలపరిమితి ఉండేలా కార్డులు మంజూరు చేయాలని కోరారు.