తిరుపతి అర్బన్ : టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర బధిర పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ప్రిపరేటరీ తరగతిలో ప్రవేశానికి రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఈ కోర్సుల్లో చేరేందుకు 5 నుంచి 8 సంవత్సరాల లోపు వినికిడి లోపం కలిగిన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
బధిర జూనియర్ కాలేజీలో...
తిరుపతిలోని ఎస్వీ బధిర జూనియర్ కాలేజీలోనూ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు. ఈ కాలేజీలో హెచ్‌ఈసీ, సీఈసీ గ్రూపులు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బధిర విద్యార్థులు అర్హులని తెలిపారు.
18 వరకు అందుబాటులో దరఖాస్తులు:
ఎస్వీ బధిర పాఠశాల, బధిర జూనియర్ కాలేజీల్లో చేరేందుకు అవసరమైన దరఖాస్తులు ఈ నెల 18వ తేదీ వరకు పాఠశాల, కాలేజీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోపు కాలేజీలో, 25వ తేదీ లోపు పాఠశాలలో అందజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వివరాల కోసం 0877-2264616 నంబరులో సంప్రదించాలని కోరారు.
బధిర పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
Published Sun, May 8 2016 8:22 PM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM
Advertisement
Advertisement