విజయవాడ, న్యూస్‌లైన్ :ఆర్థరైటిస్ వ్యాధుల్లో సంప్రదాయ విజ్ఞానాన్ని సైతం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని నిమ్స్ మాజీ డెరైక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు అన్నారు. మస్కులోస్కేలిటల్ సొసైటీ ఆధ్వర్యంలో బృందావనకాలనీలోని ఏ కన్వెన్షన్ హాలులో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ సదస్సును శనివారం డాక్టర్ నరేంధ్రనాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం జరిగిన టెక్నికల్ సెషన్‌లో డాక్టర్ కాకర్ల మాట్లాడుతూ వైద్యరంగంలో ఉన్న వారు మానవీయకోణంలో సేవలందించాలని సూచించారు. అవసరం మేరకు మాత్రమే పరీక్షలు చేయాలన్నారు. సదస్సు నిర్వాహణ కమిటీ అధ్యక్షులు డాక్టర్ జీవీ మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల పరిణామాలతో రాబోయే రోజుల్లో నగరం ప్రాముఖ్యత మరింత పెరగనుందన్నారు. దేశ స్థాయిలో గుర్తింపు పొందిన రేడియాలజీ సంఘం రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నగరంలోనే ఉందన్నారు. ముంబాయ్, డిల్లీ, బెంగళూరు వంటి పెద్ద నగరాలకు ధీటుగా నగరంలో జరుగుతున్న సదస్సుకు దేశ విదేశాల నుంచి 650 మంది ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు.
టెక్నికల్ సెషన్స్‌లో కీలక ప్రసంగాలు...
సదస్సు నిర్వాహణ కమిటీ కార్యదర్శి డాక్టర్ ఎన్‌వీ వరప్రసాద్ పల్స్ సీక్వెన్స్ ఫర్ ఆప్టిమల్ అన్న అంశంపై ప్రసంగించారు. డాక్టర్ వీరేంధ్రమోహన్(జమ్ము-తావి) రేడియాలజీలో వచ్చిన మార్పులు, శరీర భాగాల్లో ఎముకలకు దెబ్బలు తగిలినప్పుడు రేడియోగ్రాఫ్ ద్వారా తదితర చికిత్సా పద్ధతులను వివరించారు. కెనడాకు చెందిన డాక్టర్ హేమనళిని చాదుర్ ఇమేజింగ్ ఇన్‌ట్రామ, మిస్ట్ అకల్ట్ ఆన్ రేడియోగ్రాఫ్‌పై, ప్రొఫెసర్ వీరేంధ్రమోహన్ స్ల్కిలిరోజింగ్ డిస్‌ప్లేసియో అనే అంశంపై ప్రసంగించారు.
మస్కులోస్కేలిటల్ ఇమేజింగ్‌లో వ్యాధుల నిర్ధారణ, చికిత్స విధానాలపై యూకేకు చెందిన డాక్టర్ బేతపూడి శరత్, టెండాన్స్ లిగమెంట్స్ నరాల వ్యాధుల్లో ప్రధానంగా అనుసరించాల్సిన పద్ధతులను డాక్టర్ హేమనళిని వివరించారు. ఎంఆర్‌ఐ సాప్ట్ టిష్యూ ట్యూమర్‌పై అమెరికాకు చెందిన డాక్టర్ మురళీ సుందరం ప్రసంగించారు. మణికట్లు నిర్మాణం, చికిత్స ఎంఆర్‌ఐ స్కానింగ్‌లపై అమెరికాకు చెందిన టి.మధుసూదనరావు, ఎల్బోకు సంబంధించి వ్యాధి నిర్ధారణపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఈశ్వర్‌చంద్ర, ఎల్బో లిగమెంట్లు ఎన్‌ఆర్‌ఐ స్కానింగ్ విధానంపై పూనేకు చెందిన డాక్టర్ అభిమన్కుకేల్కర్, భజం ఇమేజింగ్- సర్జన్ల దృష్టికోణంపై డాక్టర్ పీఎన్‌ఎన్ ప్రసాద్( యూకే) రొటేటర్ కఫ్ ఇమేజింగ్, ఇంపింజ్‌మెంట్ సిండ్రోమ్స్‌పై డాక్టర్ భవన్ జంఖారియా (ముంబాయి) ప్రసంగించారు.
అరుదైన కేసుల ఫిల్మ్‌ల ప్రదర్శన...
అరుదైన వ్యాధులకు సంబంధించిన సీటీ, ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే ఫిల్మ్‌లతో కూడిన ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన పోస్టుగ్యాడ్యుయేషన్ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డాక్టర్ కాకర్ల పేర్కొన్నారు. అదే విధంగా కొన్ని వ్యాధులకు సంబంధించిన ఇమేజ్‌లు టీవీలో చూపించి వ్యాధి నిర్ధారణపై క్విజ్ పోటీలు నిర్వహించారు.
‘ఆర్థరైటిస్’కు సంప్రదాయ విజ్ఞానం అవసరం
Published Sun, Sep 22 2013 1:32 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
Advertisement
Advertisement