రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా సక ల జనభేరి మోగిస్తాం. ఇందుకు జిల్లావాసులు అ ధిక సంఖ్యలో తరలిరావాలి. జనభేరితో ప్రభుత్వం తలొగ్గక తప్పదు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారంటూ టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.అశోక్ పేర్కొన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
నిన్నా మొన్నటి వరకు ఆయన ఎవరికీ తెలీదు.. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు నెలరోజుల కిందటి వరకు విజయవాడలో ఎవరో తెలియదు. సమైక్యాంధ్ర ఉద్యమం పేరిట అతన్ని సీమాంధ్ర మీడియా తెరపైకి తెచ్చింది. సమైక్యవాద ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన అశోక్‌బాబు వాస్తవాలను వక్రీకరిస్తూ సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే రెండు రాష్ట్రాల సచివాలయాల్లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుందన్న కనీస జ్ఞానం లేకుండా ఉద్యోగులను సైతం తరిమికొడతారంటూ తప్పుడు ప్రచారం చేయడం వారి మనోభావాలను దెబ్బతీయడమే.
ఎన్టీఆర్ హయాంలోనే 610 జీవో..
985 డిసెంబర్ 26న అప్పటి టీఎన్జీవో నేత స్వామినాథం ఇచ్చిన రిప్రెజెంటేషన్ మేరకు అప్పటి సీఎం ఎన్టీ రామారావు 610 జీవో విడుదల చేస్తే ఇప్పటివరకు అమలుకాలేదు. సచివాలయం కేంద్రంగా అడుగడుగునా ఉల్లంఘనకు పాల్పడుతూ తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. 14ఎఫ్ రద్దయినా కోర్టు స్టే మీద చాలామంది సీమాంధ్ర ఉద్యోగులు ఫ్రీజోన్ పేరిట హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలగాణ ఏర్పడితే సీమాంధ్ర ఉద్యోగులను ఎల్లగొడతారనేది అపోహ.
సీఎంది అవివేకం..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ సర్కార్ సుముఖత వ్యక్తం చేసిన తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు విభజనకు అడ్డుతగలడం అవి వేకం. సీమాంధ్రలో జరుగుతున్నది కృత్రిమ ఉద్యమం. ఆ ఉద్య మం వెనక సీమాంధ్ర సీఎంగా మారిన కిరణ్‌కుమార్‌రెడ్డి పాత్ర ఉంది. తెలంగాణలో ఉద్యోగులు సకల జనుల సమ్మెకు దిగితే ‘ఎస్మా’ లాంటి కఠిన చట్టాల పేరిట బెదిరించిన సీఎం సంక్షేమ పథకాలు నిలిచిపోతున్నాయని వాపోయారని.. అయితే సీమాం ధ్రలో 60 రో జులుగా ఆయనే వెనుకుండి ఉద్యమం నడిపిస్తుంటే అక్కడ పథకాలు కుంటుపడడం లేదా..? రాష్ట్ర విభజన జరిగితే జల వివాదాలు ఉంటాయనడం అవివేకం. జాతీయ స్థాయిలో జ ల వివాదం పరిష్కరించేందుకు ట్రిబ్యునల్స్, జల వనరుల సం ఘాలు ఉన్న విషయాలను తెలియకుండా మాట్లాడుతున్నారు.
ఇంటికొకరు చొప్పున జనభేరికి..
ఆరు నూరైనా... నూరారైనా.. హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌం డ్‌లో సకల జనభేరి జరుగుతుంది. ఇందుకోసం ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికు లు, వృత్తిదారుల జేఏసీలతోపాటు తెలంగాణ కోరుకునే అన్ని రాజకీయ పార్టీలు భారీగా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశాయి. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి ఇంటికొక్కరు చొప్పున చలో హైదరాబాద్ తరలేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సత్వరమే జరగాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేయడంలో విఫలమైన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి.. రాష్ట్రపతి పా లన విధించాలి. తెలంగాణ ప్రక్రియకు అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదు. ఆర్టికల్-3 ప్రకారం పార్లమెంటులో తీర్మానం పెట్టి ఆమోదిస్తే తక్షణమే రాష్ట్రం ప్రకటించే అవకాశం ఉంటుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వివిధ రకాల ఉద్యమాలు కొనసాగిస్తాం.
- సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్
అటెండర్ నుంచి అధికారి వరకు ‘చలో హైదరాబాద్’
Published Sun, Sep 29 2013 4:05 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement