గోనెగండ్ల: దొంగలు ఏకంగా ఓ ఏటీఎం మిషన్ నే ఎత్తుకు పోయారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. కర్నూలు రహదారిలో ఇండియావన్ కు చెందిన ఏటీఎం కేంద్రంలో ఏటీఎం మెషిన్ కనిపించకపోవడంతో స్థానికులు శనివారం ఉదయం సదరు సంస్థకు సమాచారం అందించారు. వారొచ్చి చోరీకి గురైన నగదును మొత్తాన్ని నిర్ధారించాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.