
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు శ్రీ శారదా పీఠాదిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహర్షులు స్థాపించిన ఈ పీఠాలు భారతదేశ గొప్పతనాన్ని చాటిచెప్పేవని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంతో ఉన్నారని అన్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు రాష్ట్రంలో ప్రతిఒక్కరి మీద ఉండాలని ఆశిస్తున్నా అన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో వర్షాలు పడి పాడిపంటలతో రైతులు సుభిక్షంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం తనదైన శైలిలో తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలను ప్రతి ఒక్కరు స్వాగతిస్తారని అన్నారు.