ఉరవకొండ, న్యూస్‌లైన్ : ఉరవకొండ పట్టణంలోని ఏవీఆర్ ఇంగ్లిష్ మీడియుం స్కూల్ బస్సు (ఏపీ04 ఈ2414) వుంగళవారం చిన్నముస్టూరు గ్రామం వద్ద అదుపు తప్పి హంద్రీ-నీవా కాలువలో బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో పిల్లలెవరూ లేకపోవడంతో పెను ప్రవూదం తప్పింది. ఏవీఆర్ స్కూల్‌కు ఆమిద్యాల, రాకెట్ల, మోపిడి, ముస్టూరు తదితర గ్రావూల నుంచి విద్యార్థులు వస్తుంటారు. వీరిని వుంగళవారం సాయుంత్రం స్కూల్ బస్సు గ్రావూల్లో వదిలిపెట్టి ఉరవకొండకు వెనుదిరిగింది. హంద్రీ-నీవా కాలువ వద్ద వుుందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేయుబోరుు, అదుపుతప్పి హంద్రీ-నీవా కాలువలో పడింది.
డైవర్ రఫీ, క్లీనర్ నాయుడు స్వల్పగాయూలతో బయుటపడ్డారు. ఆ సమయంలో బస్సును క్లీనర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని ఉరవకొండ సీఐ యుల్లంరాజు, ఎస్‌ఐ శంకర్‌రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్కూల్ యూజవూన్యం మాత్రం నోరు మెదపడం లేదు. కాగా.. బస్సు సరైన కండీషన్‌లో లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నారుు. డ్రైవర్ అతి వేగంతో బస్సును నడుపుతుంటాడని, అయినా యూజవూన్యం ఎలాంటి సూచనలూ చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
హంద్రీ-నీవా కాలువలో స్కూల్ బస్సు బోల్తా
Published Wed, Nov 6 2013 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
Advertisement
Advertisement