English medium school
-
ఆంగ్లానికే పట్టం!
సాక్షి, అమరావతి: తెలుగు భాషను గుండెల నిండా నింపుకొని.. ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తేనే అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానంలో నిలవగలం. ఈ విషయాన్ని గుర్తించి.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ దిశగా అడుగులు ముందుకు వేయించారు. తెలుగు విద్యార్థులు రానున్న రోజుల్లో ఏ దేశానికి వెళ్లినా అక్కడి వారితో పోటీపడి అవకాశాలను అందిపుచ్చుకోవాలనే సదుద్దేశంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు.పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి చదువులను అందుబాటులోకి తెచ్చారు. కానీ అదేదో తప్పన్నట్లుగా, ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటే తెలుగు భాషను అవమానించినట్లుగా తప్పుడు వాదనలను తెరపైకి తెచ్చి.. పేద, ధనిక విద్యార్థులనే సామాజిక అంతరాలను తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు కొందరు తెలుగు భాషోద్దారకులమనే ముసుగు వేసుకున్న అభివృద్ధి నిరోధకుల సాయం తీసుకుంటోంది.రెండు శతాబ్దాల పోరాటం⇒ మన దేశంలో ఆంగ్ల విద్యకు 205 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రస్తుతం ఇతర దేశాలతో పాటు మనదేశంలోనూ ఇంగ్లిష్ చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చిన వారికే కార్పొరేట్ సంస్థల ఉద్యోగాల్లో ప్రాధాన్యం లభిస్తోంది. దీనిని ముందే గుర్తించిన విలియం కారీ, రాజా రామ్మోహన్ రాయ్ 1817లో కోల్‌కతాలో (అప్పటి కలకత్తా) మొదటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలను ప్రారంభించారు. ⇒ గవర్నర్ జనరల్ విలియం పిట్‌కి రామ్మోహన్ రాయ్ 1823లో రాసిన లేఖలో దేశంలో ఆంగ్ల మాధ్యమంతో ఆధునిక విద్య కోసం తీవ్రంగా వాదించారు. టీబీ మెకాలే 1835లో ఆంగ్ల విద్యా చట్టం ద్వారా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. దానిని అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటింక్ ఆమోదించారు. ప్రస్తుతం ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.⇒ 1983లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్‌ను తీసేయడం వల్ల పశ్చిమ బెంగాల్లో యువత ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయి. ఆ తప్పును ఇప్పుడు సరిదిద్దుతున్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ప్రాథమిక స్థాయి నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టాయి. పంజాబ్, జమ్మూ, కాశ్మీర్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లిష్‌ను బోధనా మాధ్యమంగా అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ రాష్ట్రాలన్నీ తమ ప్రాంతీయ భాషకు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నాయి.గ్లోబల్ ఎక్స్‌పర్ట్‌గా రాణించాలంటే తప్పదు⇒ ‘ది ఇన్సైట్ పార్ట్నర్స్’ ప్రత్యేక నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 1.75 బిలియన్ల మంది ప్రస్తుతం స్థానిక భాషగా లేదా రెండవ భాషగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. మాండరిన్ చైనీస్ మాట్లాడే 1.1 బిలియన్ల కంటే ఇది ఎక్కువ. హిందీ, స్పానిష్ భాషలు మూడు, నాల్గవ స్థానంలో ఉన్నాయి. దీనిని బట్టి ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే అగ్ర భాష ఆంగ్లం అని స్పష్టం అవుతోంది.⇒ యునైటెడ్ కింగ్డమ్లో ఎక్కువ మంది విదేశీ విద్యార్థులు ఇంగ్లిష్‌ను విదేశీ భాషగా నేర్చుకుంటున్నారు. వీరి సంఖ్య గతేడాది దాదాపు 4,19,000. ఆస్ట్రేలియాలో దాదాపు 1,69,000 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. అమెరికాలో 1,44,000 మంది విదేశీ విద్యార్థులు ఆంగ్లాన్ని విదేశీ భాషగా చదువుకుంటున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ కమ్యూనికేషన్, బహుళజాతి సంస్థలలో ఉపాధిని పెంచడం, విదేశాల్లో పనిని పొందడం, గ్లోబల్ ఎక్స్‌పర్ట్‌గా వివిధ రంగాలలో నైపుణ్యం పొందడం కోసం యువతకు ఇంగ్లిష్ నేర్చుకోవడం చాలా అవసరం.⇒ రెండు దశాబ్దాలుగా ద్విభాషా, బహుభాషా నైపుణ్యాల అవసరం గణనీయంగా పెరిగింది. ఎయిర్‌బస్, డైమ్లర్–క్రిస్లర్, ఫాస్ట్ రీటైలింగ్, నోకియా, రెనాల్ట్, శామ్సంగ్, శాప్, టెక్నికలర్, బీజింగ్‌లోని మైక్రోసాఫ్ట్ వంటి బహుళజాతి సంస్థలు ‘ఇంగ్లిష్నైజేషన్’ పేరుతో సాధారణ కార్పొరేట్ భాషగా ఆంగ్లాన్ని తప్పనిసరి చేశాయి. దీంతో ప్రపంచ భాషా సేవల పరిశ్రమ మార్కెట్ దాదాపు 55 బిలియన్ డాలర్ల ఆదాయాలనార్జిస్తోందని అంచనా. డిజిటల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ లెర్నింగ్ మార్కెట్ విలువ 2030 నాటికి 15.03 బిలియన్లకు చేరుతుందని భావిస్తున్నారు.వ్యాపార రంగంలో..⇒ వ్యాపారానికి సంబంధించిన ప్రపంచ భాష ఇంగ్లిష్. ప్రపంచంలోనే నంబర్ వన్ ఇంటర్నెట్ సేవల సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో జపాన్‌లోని అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్ కంపెనీ రకుటెన్ 2010లోనే కంపెనీ వ్యాపార అధికారిక భాషగా ఇంగ్లిష్‌ను మార్చింది. సంస్థలోని జపనీయులంతా ఆంగ్లం నేర్చుకోకుంటే ఉద్యోగాలు వదిలేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. గ్లోబల్ ఎకానమీలో మనుగడకు ఆంగ్లం అవసరమని చెప్పడానికి ఇదో ఉదాహరణ.⇒ ఆస్ట్రేలియాలో దాదాపు 385 మిలియన్ల మంది ఇంగ్లిష్ మాట్లాడుతుంటే, మన దేశంలో ఒక బిలియన్ మంది ఇంగ్లిష్ బాగా తెలిసిన వారున్నారు. ఇంటర్నెట్లో 565 మిలియన్ల మంది ఇంగ్లిష్‌నే ఉపయోగిస్తున్నారనేది మరో అంచనా. \⇒ 1998లో జర్మనీకి చెందిన హోచ్స్ట్, ఫ్రాన్స్‌కు చెందిన రోన్–పౌలెంక్ అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ అవెంటిస్ను ప్రారంభించినప్పుడు ఇంగ్లిష్‌నే ఆపరేటింగ్ లాంగ్వేజ్‌గా ఎంచుకున్నాయి. 1990వ దశకంలో ఇటాలియన్ ఉపకరణాల తయారీదారు మెర్లోని, దాని అంతర్జాతీయ ఇమేజ్ను మరింత పెంచుకోవడానికి ఇంగ్లిష్ భాషనే అనుసరించింది. ⇒ కాగా, మన రాష్ట్రంలో కొన్ని శక్తులు పేద, ధనిక వర్గాల మధ్య మరింత అంతరం పెంచి, రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ వాస్తవాలన్నింటికీ ముసుగు వేస్తుండటం ఆందోళనకరం. -
ఆంగ్ల మాధ్యమం గురించి జస్టిస్ రమణ ఎందుకలా అన్నారో?
కొద్ది రోజుల క్రితం రెండు వార్తలు గమనించాను. న్యాయవ్యవస్థలోనే అత్యున్నతమైన సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ గా బాధ్యతలు నిర్వహించి తెలుగువారికి విశిష్టత తెచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు మీడియం గురించి మాట్లాడిన విషయం ఒకటి అయితే, ప్రముఖ విద్యావేత్త కంచ ఐలయ్య ఏపీలో జరుగుతున్న విద్యా సంస్కరణలపై చేసిన ప్రసంగం వీడియో మరొకటి. జస్టిస్ రమణ తెలుగు మీడియం పై మాట్లాడితే ఐలయ్య ఆంగ్ల మీడియం గురించి గట్టిగా వక్కాణించారు. ఐలయ్య చాలా స్పష్టంగా ఏపీలో విద్యా సంస్కరణలు కొనసాగవలసిన అవసరం గురించి వివరించారు. ఆంగ్ల మీడియం ద్వారా బలహీనవర్గాలలో ఆత్మ స్తైర్యం పెరుగుతుందని, ప్రపంచంతో పోటీ పడే అవకాశం వస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. ✍️ముఖ్యమంత్రి జగన్‌ను తాను ఇంతవరకు కలవలేదని, భవిష్యత్తులో కూడా కలవవలసిన అవసరం లేదని అంటూ, ఆయన విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులు విప్లవాత్మకమైనవని చెప్పడమే తన ఉద్దేశమని ఐలయ్య తెలిపారు. ఐలయ్య చేసిన ఈ ప్రసంగానికి మీడియాలో పెద్ద ప్రాముఖ్యత లబించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం కాస్త విస్తారంగానే ప్రచారం అయింది. మరో వైపు సుప్రింకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆంగ్ల మాద్యమంపై మాట్లాడిన విషయాలు తెలుగుదేశం పార్టీ పత్రికలలో ప్రముఖంగా వచ్చాయి. ✍️ ఆయన అభిప్రాయాన్ని గౌరవించవలసిందే. ఎవరూ మాతృభాషను విస్మరించకూడదు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాని అదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదురువుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని ఆంగ్ల మాద్యమంకు ఉన్నప్రాముఖ్యతను ఆయన గుర్తించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రమణ ఆయా దేశాలకు వెళ్లినప్పుడు ఆంగ్లంలో మాట్లాడారో, లేక ఎవరినైనా దుబాసి పెట్టుకుని తెలుగులో మాట్లాడారో తెలియదు కాని, ప్రస్తుతం ఆయన చెబుతున్న విషయాలు పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆంగ్ల మాద్యమం మంచిదనే భ్రమలు వద్దు అని ఆయన అన్నారని ఈనాడు మీడియా ప్రముఖంగా ప్రచురించింది. ఇదేదో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారేమో అన్న భావన కలుగుతుంది. ఆయనకు ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు.కాని ఈనాడు మీడియా ఈ వార్త ఇచ్చిందంటే ఎంతో కొంత జగన్ ప్రభుత్వానికి నష్టం చేస్తుందని నమ్మడమే కావచ్చు. ✍️లేకుంటే ఆ వార్తకు అంత ప్రాధాన్యత ఇవ్వదు కదా! కర్నూలులో కొన్నాళ్ల క్రితం జరిగిన ఎస్టియు అంటే స్టేట్ టీచర్ల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బహుశా అది సిపిఐ మద్దతుతో నడిచే సంస్థలా ఉంది. అందుకే సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, సిపిఐ తెలంగాణ మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. వైసిపి ఎమ్మెల్యే హపీజ్ ఖాన్ కూడా ఈ సభలో పాల్గొన్నా ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏపీలో సిపిఐ పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పేదలకు వైసిపి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సైతం తప్పుపడుతున్న సిపిఐ ప్రతిపక్ష తెలుగుదేశంకు కొమ్ముకాస్తోందన్న విమర్శలు ఉన్నాయి. సిపిఐ నారాయణ చెప్పారంటూ ఏపీలో నలభైవేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రమణ నమ్మినట్లు మాట్లాడడం కూడా సముచితంగా అనిపించదు.నారాయణ తన అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతుంటారు. ✍️ఉదాహరణకు తమతో కలిసిఉన్నప్పుడు కేసీఆర్ ను హీరో అని నారాయణ పొగిడేవారు. ఆయనతో చెడగానే కేసీఆర్ అంత నియంత లేరని ద్వజమెత్తారు. ఇది వేరే సంగతి కాని ఛీఫ్ జస్టిస్ గా అత్యున్నతమైన బాధ్యతలు నిర్వహించి రిటైరైన రమణ తన గౌరవం నిలబెట్టుకునే విదంగా మాట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది. అలాకాకుండా నారాయణ వంటివారి చెప్పుడు మాటలు విని ప్రసంగాలు చేస్తే అప్రతిష్ట పాలు అయ్యే ప్రమాదం ఉంది. నిజంగా పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి?అన్నిటిని భర్తీ చేయవలసిన అవసరం ఉందా? తదితర అంశాలను తెలుసుకుని మాట్లాడితే బాగుండేది. రమణ అసలు ఎపీలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను పరిశీలించి ఉండకపోవచ్చు. ✍️కేవలం తన పాతమిత్రులైన టీడీపీ నేతలు చేస్తున్న ప్రచార ప్రభావంలో పడి మాట్లాడి ఉండవచ్చు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో ప్రభుత్వ స్కూళ్లు ఎంత అద్వాన్నంగా ఉన్నాయో ఎన్నడైనా రమణ పరిశీలించారా? ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన విశేష మార్పులనుఎన్నడైనా చూశారా?స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేసి,రంగులు వేసి ప్రైవేటు స్కూళ్లకు పోటీగా తయారు చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం రమణ కనీస బాద్యత కాదా? స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్ లను ఒకసారి ఆయన చూసి వస్తే బాగుండేది కదా! సిబిఎస్ఇ సిలబస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర విన్నూత్న అంశాలను ప్రభుత్వ స్కూళ్లలోని పేద విద్యార్దులకు అందించాలన్న జగన్ తాపత్రయాన్ని అర్దం చేసుకోకుండా రమణ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు మాట్లాడడం వల్ల సమాజానికి నష్టం జరుగుతుందని గమనించాలి.ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న అత్యాధునిక టాయిలెట్లు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఉన్న విషయాన్ని అంగీకరించరా? అసలు ప్రభుత్వ స్కూళ్లలో ఇన్ని మార్పులు తీసుకు వస్తే టీచర్లు మరింత శ్రద్దగా, బాద్యతగా పాఠాలు చెప్పాలన్న సంగతిని కూడా రమణ వంటివారు బోదించి ఉండాల్సింది. ✍️ఆ విషయాల జోలికి వెళ్లినట్లు మీడియాలో వచ్చిన వార్తలో కనిపించలేదు. ఒకవేళ ఆ ప్రస్తావన తెచ్చి ఉంటే మంచిదే. అయితే ఇంగ్లీష్ మీడియం గురించి రమణ మాట్లాడిన తీరు మాత్రం అభ్యంతరకరం అని సోషల్ మీడియాలో విస్తారంగా కామెంట్లు వచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం బోదించాలని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ప్రైవేటు స్కూళ్లలో ఆంగ్ల మీడియం గురించి ఎందుకు మాట్లాడలేదు?అంతదాకా ఎందుకు ఆయన గొప్పవారు కదా! ఆయన తన పిల్లలను తెలుగు మీడియంలోనే, అందులోను ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించానని చెప్పి ఉన్నట్లయితే చాలా మందికి స్పూర్తి దాయకం అయి ఉండేది కదా! అలాగే తన మనుమలు కూడా తెలుగు మీడియంలోనే చదువుతున్నారని అని ఉంటే ఘనంగా ఉండేది కదా! వారు ఎక్కడ ,ఏ స్కూళ్లలో చదువుతున్నారో తెలియదు కాని, బహుశా ప్రభుత్వ స్కూళ్లలో అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే పలుకుబడి కలిగినవారంతా ఇంటర్నేషనల్ స్కూళ్లలోనే చదివిస్తున్నారు కదా! తప్పు లేదు. ✍️కాని ప్రభుత్వ స్కూళ్లలోనే ఫలానా విధంగా ఉండాలని చెప్పడమే కాస్త ఆక్షేపణీయంగా అనిపిస్తుంది. న్యాయ వ్యవస్థలో ఆంగ్ల భాష ప్రాధాన్యత గురించి రమణ కు తెలియకపోదు. ఇప్పటికీ కోర్టులలో ఆంగ్లంలోనే తీర్పులు వెలువడుతుంటాయి. వాదనలన్నీ ఆంగ్లంలోనే జరుగుతుంటాయి. ఆ విషయాన్ని విస్మరించరాదు కదా? అలాగే మిగిలిన వ్యవస్థలలో కూడా ఆ పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఆంగ్ల మాద్యమమే మంచిదని భ్రమలు వద్దని చెప్పడం ద్వారా ఆంధ్ర సమాజానికి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందనిపిస్తుంది. మాతృభాషలోనే టీచర్లు బోధించాలని మాజీ జస్టిస్ చెప్పడం సహేతుకంగా లేదు. వారు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేయాలి కదా! రమణ ఒక విదంగా ఎపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని నీరుకార్చే విధంగా మాట్లాడారనిపిస్తుంది. ఒక్కసారి రమణ ఎపీలో ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించి, పిల్లలతో మాట్లాడి వారి మనోభావాలను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ✍️ఈ మధ్య నేను కొన్ని ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలతో మాట్లాడాను. ఇంగ్లీష్ మీడియం కావాలా? వద్దా? అంటే దాదాపు అంతా కావాలని బదులు చెప్పారు. ఏపీ ప్రభుత్వం పిల్లలకు టాబ్ లు ఇవ్వడాన్ని సమర్ధిస్తారా అంటే అవునని జవాబు ఇచ్చారు. ఈనాడు వంటి పత్రికలు పిల్లలకు ఇచ్చే టాబ్ లపై దరిద్రపు వార్తలను రాస్తున్న విషయాన్ని కూడా పిల్లలు గమనిస్తున్నారు. ఆ మీడియా తీరును కూడా కొందరు తప్పుపట్టారు. పరిస్థితి ఇలా ఉంటే జస్టిస్ రమణ పేద పిల్లలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు కనిపించడం సమంజసంగా కాదు. ✍️తెలుగు మీడియం అంటూ ప్రచారం చేసిన ఈనాడు అధినేత రామోజీరావు, ఆంద్రజ్యోతి రాధాకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పిల్లలను ఆంగ్ల మీడియంలో అది కూడా కార్పొరేట్ స్కూళ్లలోనే చదివించారు. చంద్రబాబు తన మనుమడిని ఎక్కడ చదివిస్తున్నారో రమణ తెలుసుకుని దానిపై స్పందిస్తే ప్రజలకు బాగా అర్ధం అవుతుంది.టీచర్ల జీతభత్యాల గురించి తన అభిప్రాయాలు చెప్పిన మాజీ ఛీఫ్ జస్టిస్ విద్యార్దులకు ఐదో తరగతి చదివినా రెండంకెల కూడికలు కూడా రావడం లేదని అన్నారు. దీనికి టీచర్లు ఏ విధంగా బాద్యత వహించవలసి ఉందో వివరించారో లేదో తెలియదు. కచ్చితంగా టీచర్లను గౌరవించవలసిందే. ✍️వారికి అన్ని విదాలుగా సదుపాయాలు సమకూర్చవలసిందే. కాని అదే సమయంలో వారు కూడా బాద్యతగా పనిచేయవలసిన అవసరం ఉంటుంది కదా! రాజకీయ పార్టీలకు అనుబందంగా కాకుండా పేదల కోసం ప్రభుత్వ టీచర్లు పనిచేసిన రోజున వారు ఏ డిమాండ్లు పెట్టినా సమాజం అర్దం చేసుకుంటుంది. ఏది ఏమైనా ఎన్నికల సమయంలో జస్టిస్ రమణ వంటివారు ఇలాంటి ఉపన్యాసాలు చేయడం వల్ల వారి ఉద్దేశాలను ప్రజలు శంకించే ప్రమాదం ఉందని చెప్పకతప్పదు.అది వారికి శోభ నివ్వదు. విద్యా వేత్త కంచ ఐలయ్య పేద వర్గాలకు, బలహీనవర్గాలకు ప్రతినిదిగా మాట్లాడిన తీరును, జస్టిస్ రమణ వంటి ప్రముఖుడు ప్రసంగించిన వైనాన్ని గమనించిన మీదట ఈ కామెంట్ రాయాలనిపించింది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఉన్నత స్థానానికి వెళ్లాలనే సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు
-
Satarupa Majumdar: బాల్యం చిగురించింది
ఆమె పేరు శతరూప మజుందార్. కోల్‌కతాలో టీచర్. అనుకోకుండా జరిగిన ఒక ప్రయాణం ఒక పెద్ద మార్పునకు బీజం అయింది. ఆ మార్పు ఆమె జీవితానికి కాదు. పదిహేడు వందల మంది పిల్లల జీవితాల్లో మార్పుకు కారణమైంది. మోడువారిన బాల్యం కొత్త చిగుళ్లు సంతరించుకుంది. శతరూప కుటుంబానికి వారమంతా పని చేయడం, వారాంతంలో సమీపంలో ఉన్న ప్రదేశానికి చిన్న టూర్ వెళ్లడం అలవాటు. అలా ఆమె 2012లో వెస్ట్ బెంగాల్‌లోని హింగల్‌గంజ్‌కు టూర్వెళ్లింది. ఇది ఒక దీవి. భారత్– బంగ్లాదేశ్‌ల సరిహద్దులో ఇచ్చామతి నది మధ్యలో ఉంది. అక్కడి పిల్లలను చూసినపుడు తీవ్రంగా మనసు కలచి వేసింది. భోజనానికి బడి దాదాపుగా ఏడాది పొడవునా వర్షాలు, వరదలతో సతమతమయ్యే ప్రాంతం అది. ప్రభుత్వం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పెడుతుంది కాబట్టి పిల్లలు స్కూలుకెళ్తారు. అయితే వాళ్లు బడిలో ఉండేది మధ్యాహ్నం భోజనం చేసే వరకే. ఆ తర్వాత మురికిగుంటల్లో ఆటలకు వెళ్లిపోతారు. బడిలో ఉండమని పిల్లల్ని కట్టడి చేయాల్సిన, అవసరమైతే మందలించాల్సిన బాధ్యతను గురువులు మర్చిపోతారు. వాళ్లను కన్నవాళ్లు బడికి పంపాల్సిన బాధ్యత ఎరిగిన వాళ్లు కాదు. చేపలు పట్టడం, బీడీలు చుట్టడం, వ్యవసాయ కూలిపనులతో కడుపు నింపుకోవడమే భారంగా ఉండే జీవితాలవి. ఈ నేపథ్యంలో సాగిన బడి ప్రస్థానం ఏ పిల్లలనైనా ఫెయిల్ చేసి తీరుతుంది. ఫెయిలైన తర్వాత ఏడాది బడిలో పేరు ఉండదు. పేరు లేదు కాబట్టి వాళ్లకు మధ్యాహ్నం భోజనం ఉండదు. పిల్లలు బడి ముఖం కూడా చూడరు. ఇక ఆ పిల్లల బాల్యం పువ్వులా ఎలా విచ్చుకుంటుంది? బడిమానేసిన పిల్లలు పెద్దవాళ్లతోపాటు బీడీలు చుట్టడంలో మునిగిపోతారు. అక్షరాలు దిద్దాల్సిన వేళ్లు బీడీలను అల్లుతుంటే చూడలేకపోయింది శతరూప. ఆ పిల్లలందరూ తన ఆరేళ్ల కూతురి వయసుకి కొంచెం అటూఇటూగా ఉన్నవాళ్లే. తన కూతురు పెరుగుతున్న వాతావరణానికీ– ఈ పిల్లలు పెరుగుతున్న వాతావరణానికీ ఎక్కడా పోలికే లేదు. పేదరికం పెనం మీద అట్టుడికి పోతున్న బాల్యం వాళ్లది. అందమైన బాల్యం పిల్లలు హక్కు. ఆ హక్కు నిరభ్యంతరంగా నేలరాయబడుతోందక్కడ. ‘స్వతంత్ర భారతంలో పాలకులు ఇన్నేళ్లపాటు వాళ్లకు అందించిన సౌకర్యాలేమిటి’ అనే ప్రశ్న మదిలో ఉదయిస్తుంది. కానీ సమాధానం చెప్పేవాళ్లే ఉండరు. అయితే శతరూప సమాధానం కోసం చూడలేదు. తనే ఒక సమాధానం కావాలనుకుంది. మర్చిపోలేదామె! ఇక్కడో విషయాన్ని గమనించాలి. ఇలాంటి పరిస్థితులను చూసినప్పుడు చాలామంది మనసు కకావికలమవుతుంది. కానీ టూర్ ముగించుకుని నగరానికి వెళ్లిన వెంటనే రొటీన్లో పడి మర్చిపోవడమూ జరుగుతుంది. అయితే శతరూప విషయంలో అలా జరగలేదు. హింగల్గంజ్ నుంచి కోల్‌కతాకు వెళ్లిన తర్వాత కూడా తాను చూసిన దృశ్యాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే స్వప్నోఫూరోన్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించింది. ‘స్వప్నోఫూరోన్’ పేరుతో సుందర్బన్లో తొలి ఇంగ్లిష్ మీడియం స్కూలు పెట్టింది శతరూప. స్వప్నోపురోన్ అంటే ‘కల నిజమాయె’ అని అర్థం. ఆ తర్వాత మరో ఐదు దీవుల్లో పాఠశాలలను తెరిచింది. ఈ పదేళ్లలో ఆ పాఠశాలలు పదిహేడు వందల బాల్యాలను గాడిలో పెట్టాయి. అచ్చమైన, అందమైన బాల్యాన్ని ఆస్వాదిస్తూ పెరుగుతున్నారా పిల్లలు. -
15 వేల స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం రాబోతోంది. వచ్చే విద్యా సంవత్సరంలో (జూన్) ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన ప్రారంభించేందుకు విద్యాశాఖ ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది. విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందాలంటే ఇంగ్లిష్ మీడియం అవసరమని ఇటీవల సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం తెలుగు మీడియం కొనసాగుతున్న 15,370 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనుంది. తెలుగుతో సమాంతరంగా ఇంగ్లిష్ మీడియం సెక్షన్లను ప్రారంభించి ఆసక్తి ఉన్న విద్యార్థులు చేరేలా చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే 10,702 స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రస్తుతం రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 26,754 పాఠశాలలు ఉన్నాయి. అందులో కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, విద్యాశాఖ గురుకులాలు, ఇతర పాఠశాలలు ఉన్నాయి. అవి పోగా 26,072 తెలుగు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు ఉన్నాయి. అందులో ఇప్పటికే 10,702 స్కూళ్లలో తెలుగుతో పాటు ఇంగ్లిష్ మీడియం కొనసాగుతోంది. మరో 15,370 స్కూళ్లలో పూర్తి స్థాయిలో తెలుగు మీడియం మాత్రమే కొనసాగుతోంది. సీఎం ఆదేశాలతో ఇప్పుడు వాటిన్నింటిలోనూ ఇంగ్లిష్ మీడియంను సమాంతరంగా ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియంలో 10,16,334 మంది విద్యార్థులు చదువుతుండగా, తెలుగు మీడియంలో 15,44,208 మంది చదువుతున్నారు. ఈ నెల నుంచే ఇంగ్లిష్ భాషాభివృద్ధి కోర్సు ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఎస్జీటీల్లో ఇంగ్లిష్ బోధనా నైపుణ్యం పెంచేలా ఈ నెల నుంచే శిక్షణ ప్రారంభించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్సు (ఈఎల్‌ఈసీ) పేరుతో శిక్షణ ఇవ్వనుంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి, అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రెండు దశల్లో నాలుగు వారాల పాటు ఈ శిక్షణ ఇవ్వబోతోంది. ఆన్లైన్లో నాలుగు వారాల పాటు ఇది కొనసాగనుంది. 43 వేల మందికి పైగా టీచర్లకు శిక్షణ రాష్ట్రంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 1,03,911 మంది టీచర్లు ఉన్నారు. వారిలో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు 60,602 మంది టీచర్లు బోధిస్తున్నారు. తెలుగు మీడియం స్కూళ్లలో మరో 43,309 మంది టీచర్లు బోధిస్తుండగా.. వీరికి ఇంగ్లిష్ మీడియంలో బోధనకు శిక్షణ ఇవ్వనున్నారు. -
పేద విద్యార్ధుల కోసమే ఇంగ్లీష్ మీడియం
-
చదువే ఆస్తి
-
తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణకు ప్రభుత్వ నిర్ణయం
-
హైకోర్టు తీర్పును టీడీపీ రాజకీయం చేస్తోంది
-
ఇంగ్లీష్ మీడియానికి పేరెంట్స్ సపోర్ట్
-
ఇంగ్లీష్ మీడియంతో విద్యార్థులకు ఎంతో మేలు
-
వైఎస్ జగన్ సీఎం అయ్యాక విప్లవాత్మక మార్పులు
-
సాంకేతిక విద్యకు దగ్గర కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం
-
ప్రగతి పథం
-
సున్నా విద్యార్థులున్న స్కూల్స్126
నల్లగొండ : ఒకనాడు చదువులకు నిలయాలుగా ఉన్న సర్కారు పాఠశాలలు నేడు ఆదరణ కోల్పోయి మూత పడే పరిస్థితికి వచ్చాయి. నిత్యం విద్యార్థులతో కళకళలాడిన పాఠశాలలు ఇప్పుడు విద్యార్థులు కరువై కళావిహీనంగా మారుతున్నాయి. ఓ పక్క ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ప్రవేశపెట్టడం, ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనల ప్రభావం తెలుగుమీడియం సర్కారు బడులపై పడుతోంది. జిల్లాల్లో చాలా పాఠశాలలు ఇప్పటికే మూత పడిపోగా ఈ సంవత్సరం కూడా మరికొన్నింటికి తాళం వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1 నుంచి 10వ తరగతి వరకు 1,483 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాల్లో బోధన సాగుతుండడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు రావడంలేదు. కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాలలు జిల్లా, డివిజన్. మండల కేంద్రాల్లో విచ్చలవిడిగా వెలిశాయి. ఆయా గ్రామాలకు స్కూళ్లకు సంబంధించిన బస్సులను కూడా పంపిస్తున్నారు. దీంతో వ్యవసాయదారులతో పాటు గ్రామాల్లో, పట్టణాల్లో కూలి చేసుకునే వారు కూడా ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చేర్పిస్తూ వస్తున్నారు. దీంతో కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అక్కడ ఉన్న ఉపాధ్యాయులను డిప్యుటేషన్లపై పక్క పాఠశాలలకు పంపిన సంఘటనలు ఉన్నాయి. గురుకులాల వైపు మొగ్గు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు కేజీ టు పీజీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను ప్రవేశపెడతానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గురుకుల పాఠశాలలు పెద్ద ఎత్తున నెలకొల్పారు. ఆయా వర్గాల వారితోపాటు ఓసీల్లోని పేదలు కూడా గురుకులాల్లోనే చేరుతున్నారు. ఒక్కో విద్యార్థిపై తెలంగాణ ప్రభుత్వం రూ.1.20లక్షల పై చిలుకే ఖర్చు చేస్తుంది. మంచి పోషకాహారంతోపాటు నాణ్యమైన విద్యను కూడా ఆంగ్లంలోనే అందిస్తుంది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులంతా గురుకుల పాఠశాలల్లో చేరారు. దీంతో గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుండగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అంతంత మాత్రంగా కొనసాగే ప్రైవేట్ పాఠశాలలు కూడా మూతపడిపోతున్నాయి. తిరిగి కొనసాగిస్తామంటున్న అధికారులు జిల్లాలో 1483 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అం దులో 126 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. ఈ పాఠశాలలన్నీ మూతపడుతుండగా 10 మందిలోపు ఉన్న పాఠశాలలు 97 ఉన్నా యి. 20 మంది పిల్లల లోపు ఉన్నటువంటి యూ పీఎస్ పాఠశాలలు 88 ఉన్నాయి. ఈ పాఠశాలల ను ఆయా గ్రామ సమీప పాఠశాలల్లో విలీనం చే సేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా ఈ విషయాన్ని విద్యాశాఖ కమిషనర్ వివరించారు. పిల్లలు లే ని పాఠశాలలను పూర్తిగా మూసివేయడం జరగద ని, తిరిగి పిల్లలు చేరితే యధావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. పక్క గ్రామాల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు రవాణా చార్జీలు తక్కువ విద్యార్థులున్న పాఠశాలలనుంచి పక్క గ్రామాల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం రవాణా చార్జీలు చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. ఒక్కో విద్యార్థికి ప్రతి నెలా రూ. 600 చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పాఠశాలల్లో పిల్లలు చేరితే యధావిధిగా కొనసాగిస్తాం ప్రస్తుతం జిల్లాలో 126 పాఠశాలల్లో విద్యార్థులు లేరు. ఆ పాఠశాలల్లో తిరిగి విద్యార్థులు చేరితే యధావిధిగా కొనసాగిస్తాం. ఎప్పుడు విద్యార్థులు వచ్చినా పాఠశాలలు కొనసాగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి. పక్క గ్రామాల పాఠశాలలకు పంపిస్తే వారికి ప్రభుత్వమే ప్రతినెలా రూ.600 రవాణా ఖర్చులను చెల్లిస్తుంది. – డీఈఓ సరోజినీదేవి -
ఇంగ్లిష్.. వింగ్లిష్..!
గతంలో: సర్కారు బడుల్లో ఏముంది..? సార్లు చెప్పే తెలుగు మీడియం పాఠాలు వినేదెవరు..? ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తే పిల్లలు నాలుగు ఇంగ్లిషు ముక్కలు నేర్చుకుంటారు. ప్రస్తుతం: మన ఊర్లోనే .. మన బడిలోనే ఇంగ్లిషు చెబుతున్నారు. ఇకపై ప్రైవేటు బడులకు పిల్లలను పంపడమెందుకు..? అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోవడమెందుకు..? చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలో ఈ ఏడాది 492 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం బోధనకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పటి వరకు ఈ పాఠశాలల్లో 5 వేల మందికి పైగా విద్యార్థులు చేరారు. నిన్న మొన్నటి వరకు ప్రీప్రైమరీ తరగతులపై కొంత ఊగిసలాట ఉన్నా, ఇప్పుడు అధికారులు టీచర్లకు భరోసానిచ్చారు. ఉపాధ్యాయుల కొరత ఉన్నచోట విద్యావలంటీర్లను నియమించడానికి కసరత్తు చేపడుతున్నారు. ఆసక్తులకు అనుగుణంగా.. పిల్లలను ఇంగ్లిషు మీడియంలోనే చదివించాలనుకునే తల్లిదండ్రుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. ఈ కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ఆ పాఠశాలలు మూతపడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఇంగ్లిషు మీడియంలో బోధించేందుకు మక్కువ చూపుతున్న టీచర్ల స్కూళ్లకు రాష్ట్ర విద్యాశాఖ అనుమతులు ఇచ్చింది. టీచర్ల ఆసక్తి, పాఠశాల యాజమాన్య కమిటీ, గ్రామ పంచాయతీ తీర్మానాలు ఉన్న పాఠశాలలకు అనుమతులిచ్చారు. మూడేళ్లపాటు పంచాయతీలే వాటి నిర్వహణ చూసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్ధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు మొగ్గుచూపుతున్నారు. 5వేల మంది విద్యార్థులు.. జిల్లాలో 4,106 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలుండగా, అందులో డీఈఓకు 1,576 మంది ఇంగ్లిషు మీడియం కావాలని వినతి చేసుకున్నారు. అందులో డీఈఓ 1279 పాఠశాలలను అంగీకరించి రాష్ట్ర శాఖకు నివేదికలు పంపారు. వాటిలో రాష్ట్ర విద్యాశాఖ 40 మంది విద్యార్థులున్న పాఠశాలలను గుర్తించి 492 పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంకు అనుమతులిచ్చింది. ఈ పాఠశాలల్లో ఇప్పటివరకు సుమారు 5వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. దీంతో ఈ ఏడాది ఒకటో తరగతిలో ఇంగ్లిషు మీడియం తరగతులు నిర్వహించనున్నారు. ఇంగ్లిషు మీడియంపై ఆసక్తి.. జిల్లాలో 492 పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఈ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు పంపి వేలకు వేలు ఖర్చు చేసుకునేకన్నా.. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియంకు పిల్లలను పంపిద్దామన్న మార్పు తల్లిదండ్రుల్లో వస్తోంది. – డాక్టర్ పాండురంగస్వామి, డీఈఓ -
హంద్రీ-నీవా కాలువలో స్కూల్ బస్సు బోల్తా
ఉరవకొండ, న్యూస్‌లైన్ : ఉరవకొండ పట్టణంలోని ఏవీఆర్ ఇంగ్లిష్ మీడియుం స్కూల్ బస్సు (ఏపీ04 ఈ2414) వుంగళవారం చిన్నముస్టూరు గ్రామం వద్ద అదుపు తప్పి హంద్రీ-నీవా కాలువలో బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో పిల్లలెవరూ లేకపోవడంతో పెను ప్రవూదం తప్పింది. ఏవీఆర్ స్కూల్‌కు ఆమిద్యాల, రాకెట్ల, మోపిడి, ముస్టూరు తదితర గ్రావూల నుంచి విద్యార్థులు వస్తుంటారు. వీరిని వుంగళవారం సాయుంత్రం స్కూల్ బస్సు గ్రావూల్లో వదిలిపెట్టి ఉరవకొండకు వెనుదిరిగింది. హంద్రీ-నీవా కాలువ వద్ద వుుందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేయుబోరుు, అదుపుతప్పి హంద్రీ-నీవా కాలువలో పడింది. డైవర్ రఫీ, క్లీనర్ నాయుడు స్వల్పగాయూలతో బయుటపడ్డారు. ఆ సమయంలో బస్సును క్లీనర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని ఉరవకొండ సీఐ యుల్లంరాజు, ఎస్ఐ శంకర్‌రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్కూల్ యూజవూన్యం మాత్రం నోరు మెదపడం లేదు. కాగా.. బస్సు సరైన కండీషన్లో లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నారుు. డ్రైవర్ అతి వేగంతో బస్సును నడుపుతుంటాడని, అయినా యూజవూన్యం ఎలాంటి సూచనలూ చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.