బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం | ball badminton competitions start | Sakshi
Sakshi News home page

బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం

Published Fri, Dec 13 2013 1:59 AM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM

ball badminton competitions start

నరసరావుపేటరూరల్, న్యూస్‌లైన్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల బాల్‌బ్యాడ్మింటన్ క్రీడాపోటీలు గురువారం నరసరావుపేట మండలం జొన్నలగడ్డ శివారు కృష్ణవేణి నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. నరసరావుపేట డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రీడా పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.  

తొలిరోజు నిర్వహించిన మ్యాచ్‌లలో  కృష్ణవేణి డిగ్రీ కళాశాల జట్టుపై ఏపిఆర్(సాగర్) డిగ్రీ కళాశాల జట్టు, చెరుకుపల్లి ఎస్‌ఎంపి జట్టుపై వీఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్(చీరాల) జట్టు, ఏఎన్‌యూ వ్యాయామ కళాశాల జట్టుపై రేపల్లె ఎస్‌ఏబీ జట్టు, పీఎన్‌సి అండ్ కేఆర్(నరసరావుపేట) జట్టుపై గుంటూరు టీజేపిఎస్ కళాశాల జట్టు, ఎస్‌ఈఏఎస్ (మద్దిరాల) జట్టుపై వీఆర్‌ఎస్‌అండ్ వైఆర్‌ఎన్ జట్టు, ఏపిఆర్‌డిసి (నాగార్జునసాగర్) జట్టుపై ఆర్‌సి కళాశాల(రేపల్లె) జట్టు విజయం సాధించి లీగ్ మ్యాచ్‌లలోకి ప్రవేశించాయి.  కార్యక్రమంలో టోర్నమెంట్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు,  కార్యదర్శి ఈదర ఆదిబాబు, జొన్నలగడ్డ సర్పంచ్ దొండేటి అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement